టీకా ఎన్ని డోసులు తీసుకోవాంటే... రెండు డోసులే అని ఎవరైనా.. ఠక్కున చెప్పేస్తారు. కేంద్రం ఈ మధ్య ఇచ్చిన ప్రికాషనరీ డోసుతో కలిపితే మూడు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా.. 11 సార్లు టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని అతడే ప్రకటించాడు. ఇక అతడిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.


బిహార్‌లోని మాధేపురా జిల్లాలోని ఒరై గ్రామానికి చెందిన 84 ఏళ్ల వ్యక్తి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను 11సార్లు తీసుకున్నాడు. 12వ డోస్ తీసుకునేందుకు వెళ్లి పట్టుబడ్డాడు. బ్రహ్మదేవ్ మండల్‌ అనే వ్యక్తి ఏకంగా 11 సార్లు వ్యాక్సిన్ తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వ్యాక్సిన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందుకే పలుమార్లు వ్యాక్సిన్  తీసుకున్నట్టు చెప్పాడా వ్యక్తి. 
"నేను వ్యాక్సిన్‌తో చాలా ప్రయోజనం పొందాను. అందుకే పదే పదే తీసుకుంటున్నాను" అని కొద్ది రోజుల క్రితం చెప్పాడు మండల్. 


రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి అయిన మండల్, గత ఏడాది ఫిబ్రవరిలో తన మొదటి కరోనా వ్యాక్సిన్‌ డోస్‌ తీసుకున్నాడు. అప్పటి నుంచి మార్చి, మే, జూన్, జూలై, ఆగస్టు  వ్యాక్సిన్ వేయించుకున్నాడు. 


అలా డిసెంబర్ 30 నాటికి  ఒకే పబ్లిక్ హెల్త్ సెంటర్‌లో 11 సార్లు వ్యాక్సిన్‌ వేసుకున్నాడు. ఆ వ్యక్తి తన ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌ను వినియోగించి ఎనిమిది సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. మిగిలిన మూడు సందర్భాల్లో తన ఓటర్ ఐడి కార్డ్, అతని భార్య ఫోన్ నంబర్‌ను ఉపయోగించాడని అధికార్లు తేల్చారు. దీంతో అతడిపై.. ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. జిల్లా వైద్యాధికారి డా.వినయ్‌ కృష్ణ ఫిర్యాదు మేరకు 188, 419,  420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు బ్రహ్మదేవ్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.


ఏయే తేదీల్లో టీకా తీసుకున్నదీ ఆయన రాసి పెట్టుకున్నాడు కూడా. ఈ  విషయం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో స్పందించిన జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది. తాజాగా అతడిపై చర్యలకు దిగింది.


Also Read: Covid 19 3rd Wave: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!


Also Read: NEET PG Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్‌ తేదీలపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన..


Also Read: Covid 19 India Cases: భారత్‌లో ఒమిక్రాన్ కల్లోలం.. నిన్న ఒక్కరోజులో 552 మందిలో కొత్త వేరియంట్ నిర్ధారణ


Also Read: PM Modi Meeting: కొవిడ్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష.. లాక్‌డౌన్‌ తప్పదా?