Bibhav Kumar Approached The High Court : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిభవ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ తీజ్ హజారి కోర్టు నాలుగు రోజులపాటు కస్టడీ విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.


ఢిల్లీ పోలీసులు ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరినప్పటికీ.. బిభవ్ కుమార్ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లైంట్ పై ఎలాంటి సాక్ష్యాలు లేనందున ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఇవ్వాలనడం సరికాదని బిభవ్ కుమార్ తరపు న్యాయవాది వాదించారు. అయినప్పటికీ కోర్టు మూడు రోజులపాటు కష్టడిని విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా దీనికి ఒక రోజు ముందు బిభవ్ కుమార్ బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీలోని తీజ్ హజారీ కోర్టు కస్టడీ విధించిన నేపథ్యంలో బిభవ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తనను జైలు నుంచి విడుదల చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో ఈ కేసులో ఢిల్లీ పోలీసుల ప్రమేయం ఉందని, వారిపైనా విచారణ జరిపించాల్సిందిగా పిటిషన్ లో ఆయన హైకోర్టును అభ్యర్థించారు.


తీవ్రమైన కేసుగా పేర్కొన్న పోలీసులు


ఈ నెల 13న న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో మలివాళ్లపై కుమార్ దాడికి పాల్పడ్డారు. తనపై అనుచిత పదజాలాన్ని ఉపయోగించాడని మలివాల్ ఆరోపించారు. సీఎం అధికారిక నివాసం వద్ద ఉన్నప్పుడే.. టేబుల్ పై ఆమె తలను లాగి కొట్టడంతోపాటు పాసవికంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై అరెస్టు చేసిన పోలీసులు కోర్టుకు తరలించగా.. నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని థీస్ హజారీ కోర్టు సోమవారం బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.


బాధితురాలు పేర్కొన్న అంశాలను కొట్టిపారేయలేమన్న కోర్టు, బిభవ్ కుమార్ బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేయడం, తారుమారు చేయడం వంటి భయాన్ని బాధితురాలు వ్యక్తం చేసిందని, దీన్ని  తోసిపుచ్చలేమని కోర్టు పేర్కొంది. అదే సమయంలో ఢిల్లీ పోలీసులు కూడా రిమాండ్ రిపోర్టులో.. ఇది తీవ్రమైన కేసు అని, క్రూరమైన దాడి, ప్రాణాంతకంగా మారవచ్చని పేర్కొన్నారు. కుమార్ విచారణకు కూడా సహకరించడం లేదని పోలీసులు ఆరోపించారు. ఇది ఒక పార్లమెంటు సభ్యుడు, ప్రజా ప్రతినిధిపై క్రూరమైన దాడిగా, తీవ్రమైన కేసుగా పోలీసులు కోర్టుకు నివేదించారు. నిర్దిష్టమైన ప్రశ్నలు ఉన్నప్పటికీ నిందితుడు దర్యాప్తులో సహకరించడం లేదని అతని సమాధానాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు కస్టడీని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన ప్రస్తుతం కుమార్ హైకోర్టును ఆదేశించారు. 


Also Read: Delhi News: కేజ్రీవాల్ సర్కారుకు షాక్, పరువు నష్టం కేసులో మంత్రి అతిషికి కోర్టు సమన్లు