జిమ్‌లో ( Gym ) కసరత్తులు చేస్తూ హఠాత్తుగా ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో పలువురు ప్రముఖులు ఇలాగే ప్రాణాలు కోల్పోయారని ప్రచారం జరుగుతోంది. అయితే అందరూ పురుషులే. తాజాగా ఓ మహిళ .. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి చనిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో రికార్డయ్యాయి.


బెంగళూరులోని బయ్యప్పన్న హళ్లి ప్రాంతంలోని ఉన్న జిమ్‌లో వినయ విఠల్ ( Vinaya )  అనే మహిళ ప్రతీ రోజూ వచ్చి జిమ్ చేస్తుంది. ఎప్పట్లాగే ఆమె జిమ్‌కు వచ్చి కసరత్తులు చేస్తోంది. వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా కిందపడిపోయింది. పెద్ద శబ్దంతో వినయ విఠల్ పడిపోవడంతో జిమ్‌లో ఉన్న ఇతరులు హుటాహుటిన ఆస్పత్రికి ( Hospital ) తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లుగా ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. 


స్టార్ హీరోపై పార్లమెంటులో వెంకయ్య జోకులు- పడిపడి నవ్విన సభ్యులు


సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా చేస్తున్న వియన విఠల్ బెంగళూరులో ( bengalore ) ఒంటరిగా ఉంటున్నారు. ఫిట్నెస్‌కు ( Fitness ) ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రతీ రోజు ఆ జిమ్‌కు వచ్చి కసరత్తులు చేసేవారు. గతంలో ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని.. కుటుంబసభ్యులు చెబుతున్నారు. వర్కవుట్స్  ( Workouts ) చేస్తున్న సందర్భంలో కూడా పలువురు గుండెపోటుకు గురవుతున్న ఘటనలు ఈమధ్య కాలంలో జరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.




జిమ్ చేసే వారికి పలు సూచనలు సలహాలు నిపుణులు ఇస్తున్నారు.  చిన్న చిన్న రూమ్‌లో ఉండే జిమ్‌ సెంటర్‌లలో వ్యాయామం చేయొద్దు. ఎందుకంటే వెయిట్‌ లిఫ్టింగ్‌, రన్నింగ్‌, జాగింగ్‌ చేసినప్పుడు మనం వదిలిన గాలినే తిరిగి తీసుకోవాల్సి వస్తుంది. దీంతో బ్లడ్‌లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బలహీనంగా ఉన్న వారికి ఊపిరితిత్తులు సరిగా పని చేయవు. దీంతో ఒత్తిడి పెరిగి కార్డియా అటాక్‌తో చనిపోయే ఛాన్స్‌ ఉంటుంది.  మెడిసన్స్‌ వాడుతున్న వారైతే ముఖ్యం డాక్టర్ల సూచనల మేరకే జిమ్ చేయాలి.ఇక జిమ్‌ సెంటర్‌లో తప్పనిసరిగా మెడికల్‌ అడ్వైజర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మన సామర్థ్యం మేరకు వ్యాయామం చేయాలని.. ఎక్కువ బరువున్న పరికరాలను అస్సలు ఎత్తొద్దు. ఇక వ్యాయామం చేస్తున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్క్‌లు ధరించకూడదని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.  


బంగాల్ అసెంబ్లీలో దంగల్- చొక్కాలు చిరిగేలా ఎమ్మెల్యేల ఫైట్