Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!

ABP Desam   |  Murali Krishna   |  26 May 2022 05:15 PM (IST)

Bengal Cabinet: బంగాల్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలకు ముఖ్యమంత్రిని ఛాన్స్‌లర్‌గా చేసే ప్రతిపాదనకు ఓకే చెప్పింది.

మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!

Bengal Cabinet: బంగాల్ ప్రభుత్వం మరో కొత్త వివాదానికి తెరలేపింది. ఇప్పటికే గవర్నర్- ముఖ్యమంత్రి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటున్న వేళ బంగాల్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రిని ఛాన్స్‌లర్‌గా చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. ఈ మేరకు బంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుతం నడిపే యూనివర్సిటీలకు గవర్నర్ బదులుగా ముఖ్యమంత్రిని ఛాన్స్‌లర్‌గా ఉంచే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రతిపాదనను త్వరలోనే బిల్లుగా అసెంబ్లీ ముందుకు తీసుకొస్తాం.                                                                                      -  బ్రత్య బసు, బంగాల్ విద్యాశాఖ మంత్రి

తమిళనాడు

విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్‌ వర్సిటీల వైస్‌ ఛాన్సలర్లను నియమించడం సంప్రదాయం. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా గవర్నర్లు దాన్ని తమ ప్రత్యేక హక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని అగౌరవపర్చడమే గాక, ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం. అంతేగాక, వైస్‌ ఛాన్సలర్ల నియామకం విషయంలో ప్రభుత్వానికి అధికారం లేకపోవడం ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశ్వవిద్యాలయ పాలనా వ్యవహారాల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది. అందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టి చట్టంలో సవరణ చేశాం. అంతెందుకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ వీసీలను గవర్నర్‌ నేరుగా నియమించరు. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరిని వీసీగా ఎంచుకుంటారు. - ఎంకే స్టాలిన్​, తమిళనాడు ముఖ్యమంత్రి

Also Read: Rajya Sabha Polls 2022: భార్యను పక్కన పెట్టిన అఖిలేశ్ యాదవ్- కీలక నిర్ణయం!

Also Read: Domestic Violence Rajasthan: ఇదేం కొట్టుడురా నాయనా! బ్యాట్‌తో కొడితే కోర్టులో పడిన భర్త!

Published at: 26 May 2022 05:09 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.