CM KCR Meets Devegowda : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) గురువారం మ‌ధ్యాహ్నం బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా మాజీ ప్రధాని దేవెగౌడ(Devegowda) నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. దేవెగౌడ కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి(Kumaraswamy) సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు. అనంతరం దేవెగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ధోరణి, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల(President Vice President Elections) అంశాన్ని ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. దేశ్‌కి నేత అంటూ కటౌట్లు కలిపించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌(Hyderabad)కు చేరుకోనున్నారు.



రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ! 


ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యేలు  రాజేంద‌ర్ రెడ్డి, కృష్ణ మోహ‌న్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. దేవెగౌడ, కుమారస్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం అనంతరం జాతీయ రాజకీయాలు, ఇతర సమకాలీన అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించారు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై ప్రాంతీయ పార్టీల పాత్రపై వారు చర్చించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా పద్మనాభనగర్‌లోని దేవెగౌడ ఇంటి పరిసరాల్లో కేసీఆర్‌ కటౌట్లు(KCR Cutouts) వెలిశాయి. 



రేపు రాలెగావ్ సిద్ధికి!


జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఎజెండా లక్ష్యంతో, జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు సిద్ధమైన సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన(National Tour) చేపట్టారు. అయితే ఈ పర్యటను మధ్యలోనే ముగించుకుని సోమవారం హైదరాబాద్ తిరిగివచ్చారు. ఈ నెల 27 వరకు కొనసాగాల్సిన పర్యటనను మధ్యలోనే ముగించుకొని కేసీఆర్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నెల 20న దిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. జాతీయ నేతలు, రాజకీయ, మీడియా ప్రముఖులతో సీఎం కేసీఆర్ వరుసగా భేటీ అయ్యారు. అనంతరం చంఢీగడ్ లో రైతులు, సైనికుల కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం చేశారు. ఈ నెల 27న రాలెగావ్‌ సిద్దికి కేసీఆర్ వెళ్లాల్సి ఉంది. బెంగళూరులో జేడీఎస్‌ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సీఎం కేసీఆర్‌ గురువారం భేటీ అయ్యారు. రేపు(27న) రాలెగావ్‌ సిద్ది పర్యటనకు వెళ్లి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ కానున్నారు. అక్కడి నుంచి షిర్డీకి వెళ్లి దర్శనం చేసుకొనున్నారు.