Assembly Election 2023:



కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల తేదీలు వెల్లడించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎలక్షన్ డేట్స్‌ని ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. నాగాలాండ్, మేఘాలయాలో ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనున్నట్టు తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీల గడువు మార్చి నెలలోనే పూర్తి కానుంది. త్రిపురలో ప్రస్తుతానికి బీజేపీ అధికారంలో ఉంది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP) ప్రభుత్వం నడుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీల్లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఒకే ఒక పార్టీ...నేషనల్ పీపుల్స్ పార్టీ. ప్రస్తుతం మేఘాలయాలో ఈ పార్టీయే అధికారంలో ఉంది.