Twitter Revenue Down: 


40% డౌన్..


ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఎలన్‌ మస్క్‌కు సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రెవెన్యూ విషయంలో చాలా ఇబ్బందులు పడుతోంది ఆ కంపెనీ. ఎలాగైనా సరే...దారిలో పెట్టాలన్న పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు మస్క్. కానీ...క్రమంగా ట్విటర్‌ రెవెన్యూ తగ్గిపోతూనే ఉంది. ఇప్పుడు మరో 40% మేర పడిపోయినట్టు తేలింది. ఈ దెబ్బతో ట్విటర్‌ మరింత కష్టాల్లో కూరుకుపోయింది. ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ఎలన్ మస్క్ 13 బిలియన్ డాలర్ల అప్పు చేశారు. దానికి వడ్డీ మాత్రం కట్టడం లేదు. ఈ నెలాఖరులోగా ఈ వడ్డీని కట్టాల్సి ఉంది. అయితే...ఈ వడ్డీ కట్టేందుకు మస్క్ టెస్లా షేర్‌లు అమ్మనున్నట్టు సమాచారం. మస్క్ వచ్చినప్పటి నుంచి కంపెనీలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. ఇవి నచ్చని బడా బ్రాండ్‌లు క్రమంగా తప్పుకున్నాయి. ట్విటర్‌లో యాడ్స్ ఇచ్చేందుకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా..ఆ మేరకు రెవెన్యూ కోల్పోవాల్సి వచ్చింది. ఇది గమనించిన మస్క్ వెంటనే అప్రమత్తమయ్యారు. కొన్ని కంపెనీలతో ప్రత్యేకంగా చర్చలు జరిపి మళ్లీ వెనక్కి తీసుకొచ్చారు. కాస్తో కూస్తో ట్విటర్ రెవెన్యూని కాపాడుతున్నవి ఆ కంపెనీలే. అటు ట్విటర్‌ షేర్ వాల్యూ కూడా పడిపోతోంది. ఈ లోటుని భర్తీ చేసుకునేందుకు మస్క్ చాలానే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చారు. ఇది కూడా కంపెనీని గట్టెక్కించలేదు. నెలకు 8 డాలర్లు చెల్లిస్తేనే బ్లూ టిక్ కంటిన్యూ అవుతుందని
చెప్పినా...దానితోనూ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కేవలం ఏడాది కాలంలో మస్క్ 200 బిలియన్ డాలర్ల మేర నష్టపోయారు. 2021 నవంబర్‌లో మస్క్ ఆస్తి 340 బిలియన్ డాలర్లు కాగా...2022 చివరి నాటికి 200 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానంలో మస్క్‌...ఇప్పుడు ఆ ర్యాంక్‌నీ కోల్పోయారు. 


యూజర్‌ నేమ్స్‌ విక్రయం..


ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ మరో క్రేజీ ఆలోచనతో ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే యూజర్‌ నేమ్స్‌ని విక్రయించనున్నట్టు సమాచారం. ఆన్‌లైన్ వేలం ద్వారా యూజర్ నేమ్స్‌ని అమ్మేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నారంటూ కొన్ని నివేదికలు చెబుతున్నాయి. రెవెన్యూ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటారని అంటున్నాయి. The New York Times రిపోర్ట్ ప్రకారం...ట్విటర్ ఇంజనీర్స్‌ ఇప్పటికే ఈ పనిలో ఉన్నారు. ఆన్‌లైన్‌లోనే యూజర్‌ నేమ్స్‌ని, ట్విటర్ హ్యాండిల్స్‌కు బిడ్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇన్‌యాక్టివ్‌గా ఉన్న యూజర్ నేమ్స్‌ని అమ్మేస్తారన్నమాట. అయితే...ఇందుకు ఎంత మొత్తం ఛార్జ్ చేస్తారన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. "ఇన్‌యాక్టివ్‌గా ఉన్న యూజర్‌నేమ్స్‌ని విక్రయించాలని కంపెనీలో చర్చలు జరుగుతున్నాయి. విశ్వసనీయ వర్గాల ద్వారా ఇది తెలిసింది" అని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 150 కోట్ల మంది యూజర్స్‌ని తొలగిస్తామని 
ట్వీట్ చేశారు. చాలా రోజులుగా యాక్టివ్‌గా లేని అకౌంట్‌లను తీసేస్తామని చెప్పారు. 


Also Read: Elon Musk Tweet: మస్క్‌ మామ కొంప ముంచిన 'తప్పుడు ట్వీట్‌', చేతలు అదుపులో ఉండవుగా మరి!