Viral Video: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. ఓ ఫైర్ బ్రాండ్. అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయాల్లోనూ ఆమె ఓ సెలబ్రిటీ. ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు. సినిమాలు చేస్తున్నప్పుడు ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి పాత్రలోకైన పరకాయ ప్రవేశం చేసే వారు. ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ఎలాంటి అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటూ తన దైన స్టైల్ లో దూసుకుపోతున్నారు. ఆమె రూటే సెపరేటు. ఏదైన కార్యక్రమానికి, ప్రారంభోత్సవానికి వెళ్తే సాధారణ రాజకీయా నాయుకులు చేసినట్లుగా రిబ్బన్ కట్ చేసి, జెండా ఊపి, నాలుగు మాటలు మాట్లాడి వచ్చే ధోరణి కాదు మంత్రి ఆర్కే రోజాది. అంబులెన్స్ ప్రారంభించడానికి వెళ్తే అంబులెన్స్ డ్రైవర్ గా మారతారు, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్తే నృత్యకారిణి అవతారం ఎత్తుతారు. అందుకే రోజా రూటు సెపరేటు అంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



మహా శివరాత్రి సందర్భంగా మంత్రి ఆర్కే రోజా వారణాసి ( కాశీ)కి వెళ్లారు. శనిత్రయోదశి శనివారం రోజు రావడం అందులోనూ మహా శివరాత్రి కలిసి రావడంతో ఈ ప్రత్యేక రోజును పరమేశ్వరుడి సేవకు అంకితం చేయాలన్న ఉద్దేశంతో మంత్రి కాశీకి వెళ్లారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. పవిత్ర గంగానది వద్ద నిర్వహించే హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ఫ్రెండ్ తో కలిసి రిక్షా ఎక్కారు ఆర్కే రోజా. సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ రిక్షాలో కాశీ వీధుల్లో తిరిగారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను మంత్రి ఆర్కే రోజాయే తన సోషల్ మీడియా వేదికగా అప్ లోడ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.