Animals Care in Jharkhand: మామూలుగా ఆదివారం అంటే బడి పిల్లలకు, ప్రభుత్వం ఉద్యోగులకు సెలవులు ఉండడం మన అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఆడవాళ్లకు కూడా ఆదివారం సెలవు ఇవ్వాలని కోరుతూ ఏకంగా సినిమానే తీశారు. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రోజు ఆడవాళ్లకు సెలవు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అంటే ఆరోజు ఆడవాళ్లు ఎవరూ వంట పని కూడా చేయరు. వీటన్నిటికి భిన్నంగా ఓ ప్రాంతంలో పశువులకు ఆదివారం సెలవు ఇచ్చారు. అదేంటీ పశువులకు సెలవు ఏమిటి అనుకుంటున్నారా.. అవును. ఆదివారం రోజు అక్కడి పశువులను దొడ్లలో మాత్రమే ఉంచుతారు. ఆరోజ గ్రామస్థులంతా పశువులకు సేవలు చేస్తారు. కనీసం ఆరోజు పాలు కూడా పితకరు. 


పశువులకు సెలవిచ్చే ప్రాంతమేమిటి?


జార్ఖండ్‌లోని 20కిపైగా గ్రామాల్లో పశువులకు కూడా ఒకరోజు సెలవు ఇస్తారు. ఆదివారాల్లో ఈ జంతువులతో ఎలాంటి పని చేయించుకోరు. లోథర్ జిల్లాలోని 20 గ్రామాల్లో పశువులకు ఆదివారం రోజు సెలవు దినంగా ఇస్తున్నారు. ఆరోజు ఆవులు, గేదెలకు పాలు కూడా పితకరు. జంతువులతో చేయించుకోవాల్సిన పనులన్నీ నేరుగా ప్రజలే చేసుకుంటారు. ఆదివారం పశువుల పెంపకందారులందరూ పశువులకు ఎంతో సేవ చేస్తారు. వాటికి బాగా మేత పెడతారు. అంతే కాకుండా ఆదివారాల్లో పశువుల కాపరులే పలుగులతో పొలాలకు వెళ్తారు. స్వయంగా వెళ్లి పొలాల్లో పని చేస్తుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ జంతువును ఇతర పనుల కోసం పొలానికి తీసుకెళ్లరు. రైతులు ఈ రోజు పని చేయడానికి ఇష్టపడతారు.


100 ఏళ్ల సంప్రదాయం.. 


తమ పూర్వీకుల నుంచి ఈ సంప్రదాయం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. 100 సంవత్సరాలకు పైగా ఉంది. రాబోయే తరాలు దానిని అనుసరిస్తున్నాయని గ్రామస్థులంతా భావిస్తున్నారు. ఇది మంచి పద్దతి అని పశువైద్యులు చెబుతున్నారు. మనిషికి కూడా వారానికి ఒకరోజు విశ్రాంతి అవసరం. అలాగే జంతువులు కూడా విశ్రాంతి తీసుకోవాలి.


ఆ సంప్రదాయం ఎందుకు మొదలైంది..?


సుమారు 100 ఏళ్ల క్రితం పొలం దున్నుతుండగా ఓ ఎద్దు చనిపోయిందని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ మేరకు గ్రామంలో సమావేశం నిర్వహించారు. జంతువులకు ఒకరోజు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రోజు ఆదివారం ఫిక్స్ అయింది. అప్పటి నుంచి ఆదివారం రోజు జంతువుల నుంచి ఎలాంటి పని చేయించుకోరు. గ్రామంలోని జంతువులన్నీ ఈ రోజంతా విశ్రాంతి తీసుకుంటాయి.