Watch Video: దటీజ్ ఇండియన్ ఆర్మీ - అమర్​నాథ్ యాత్రికుల కోసం 4 గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం

Indian Army Restores Bridge: కొండ చరియలు విరిగిపడి బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో.. అమర్‌నాథ్ యాత్రికులకు ఏ ఇబ్బంది కలగకూడదని ఆర్మీ కేవలం 4 గంటల్లోనే రెండు బ్రిడ్జిలను నిర్మించి రికార్డ్ క్రియేట్ చేసింది.

Continues below advertisement

Indian Army Chinar Corps Restores 4 hour Detour: కరోనా వ్యాప్తితో రెండేళ్లు రద్దయిన అమర్‌నాథ్ ఈ ఏడాది వైభవంగా జరుగుతోంది. అయితే రెండు రోజుల కిందట విషాద ఘటన జరిగింది. కొండ చరియలు విరిగిపడి రెండు బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. అమర్‌నాథ్ యాత్రికులకు ఏ ఇబ్బంది కలగకూడదని భావించిన ఇండియన్ ఆర్మీ రికార్డు సమయంలో కేవలం 4 గంటల్లోనే రెండు బ్రిడ్జిలను నిర్మించి రికార్డ్ క్రియేట్ చేసింది. అమర్‌నాథ్ యాత్ర నిరాటంకంగా కొనసాగేలా తీసుకున్న చర్యలలో భాగంగా తక్కువ సమయంలో వంతెనలు ఏర్పాటు చేశారు.

Continues below advertisement

కొట్టుకుపోయిన రెండు వంతెనలు.. రంగంలోకి దిగిన ఆర్మీ.. 
ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ (Indian Army Chinar Corps) అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. అయితే ఇటీవల ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా జూన్ 30, జులై 1 మధ్య రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో యాత్రా మార్గంలో కాళీమాతా ఆలయ సమీపంలో బల్తాల్ వద్ద రెండు వంతెనలు కొట్టుకుపోయాయి. అమర్‌నాథ్ యాత్రికులకు ఏ ఇబ్బంది కలగకూడదని భావించిన చినార్ కార్ప్స్ ఆర్మీ వింగ్ కేవలం 4 గంటల సమయంలోనే కొట్టుకుపోయిన వంతెనల వద్ద మరో రెండు కొత్త వంతెనల్ని నిర్మించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ చినార్ కార్ప్స్ షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాత్రికి రాత్రే రికార్డు సమయంలో వంతెనల నిర్మాణం.. 
రెండేళ్ల తరువాత అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం కాగా మంచు శివలింగాన్ని దర్శించుకునేందకు భక్తులు తరలివెళ్తున్నారు. రెండు రోజుల కిందట కొండచరియలు విరిగిపడి బ్రిడ్జిలు కొట్టుకపోవడంతో చినార్ కార్ప్స్ / 15 కార్ప్స్ అని పిలిచే ఇండియన్ ఆర్మీ విభాగం రంగంలోకి దిగింది. కాళీమాత ఆలయం సమీపంలో, కలమట వద్ద వంతెనలు కొట్టుకుపోగా.. చినార్ కార్ప్స్  13 ఇంజనీర్ రెజిమెంట్ రాత్రికి రాత్రి బ్రిడ్జిలను నిర్మించి అమర్ నాథ్ యాత్రికులకు ఇబ్బందులు లేకుండా చేసింది. దేశ ప్రజలకు సమస్య తలెత్తితే భారత సైన్యం ఎక్కడైనా, ఎప్పుడైనా అక్కడ ప్రత్యక్షమవుతుందని ఇండియన్ ఆర్మీ మరోసారి రుజువు చేసింది. 

Also Read: Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!

Also Read: Software Engineer Suicide: జాబ్‌లో జాయినింగ్ అని హైదరాబాద్ బయలుదేరిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - తల్లికి మెస్సేజ్ చేసి సూసైడ్

Continues below advertisement