Software Engineer committed suicide : కరోనా వ్యాప్తి తరువాత ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రతి చిన్న విషయానికి చిన్నా పెద్ది అనే వ్యత్యాసం లేకుండా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం కేసు విషాదంగా మారినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని, జాబ్ లో జాయిన్ అవుతానని చెప్పిన గుంటూరు జిల్లా నుంచి బయలుదేరిన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.


అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరుకి చెందిన జాస్తి శ్వేత (22) సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తోంది. మూడు నెలల కిందటి నుంచి వర్క్ ఫర్ హోమ్ చేస్తోంది. ఈ క్రమంలో  హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆమె ఉద్యోగంలో చేరాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉద్యోగంలో జాయిన్ అవుతానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని చిల్లకల్లులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్వేత మిస్ అయింది. జాబ్‌లో చేరేందుకు హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన శ్వేత ఆపై మనసు మార్చుకుంది.


డిప్రెషన్‌లో ఉన్నానంటూ మెస్సేజ్.. ఆత్మహత్య
జాబ్‌లో చేరేందుకు హైదరాబాద్ బయలుదేరిన శ్వేత చిల్లకల్లుకు చేరుకున్నాక తాను డిప్రెషన్ లో ఉన్నానని, చనిపోవాలని ఉందంటూ తల్లికి మెస్సేజ్ చేసింది. కూతురి నుంచి వాట్సాప్ రాగానే ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. వారు కూడా చిల్లకల్లుకు బయలుదేరారు. చిల్లకల్లులోని చెరువులో దూకి శ్వేత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి రాత్రి 1 వరకు చెరువులో ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోయింది. నేటి ఉదయం శ్వేత మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు.


శ్వేత శనివారం సాయంత్రం మంగళగిరిలో ఐదు గంటలకు ఇంటి నుంచి బయలుదేరినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో తాను డిప్రెషన్‌లో ఉన్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లికి వాట్సాప్ మెస్సేజ్ చేసింది సాఫ్ట్ వేర్ ఇంజినీర్. చిల్లకల్లు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ శ్వేత కోసం పోలీసులు వెతుకుతున్నారు. తమ కూతురు బతికే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన శ్వేత తల్లిదండ్రులు ఆమె డెడ్ బాడీని రెస్క్యూ టీమ్ వెలికితీయగానే కన్నీటి పర్యంతమయ్యారు.


తమకు ఎవరి పైన అనుమానం లేదని, అయితే శ్వేత ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదని ఆమె తాత చెప్పారు. అందరితో కలివిడిగా ఉండే తమ మనవరాలు అలా ప్రాణాలు లేకుండా కనిపించడాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నామని తల్లిదండ్రులతో పాటు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


Also Read: Dakshin Express Fire Accident: దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం - అర్ధరాత్రి ప్రాణ భయంతో ప్రయాణికుల పరుగులు


Also Read: East Godavari News : కోనసీమ జిల్లాలో ఘోరం, తల్లీకూతురు సజీవదహనం, అల్లుడిపై అనుమానం!