Delhi Blast Case Update : ఢిల్లీ ఉగ్రవాద కుట్రలో నిందితురాలైన అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యుల్లో ఒకరైన డాక్టర్ షాహీన్ షాహిద్ దుబాయ్‌కు పారిపోవాలని ప్లాన్ చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. అనేక రాష్ట్రాలలో తీవ్రవాద వైద్య నిపుణుల నెట్‌వర్క్‌ను కనుగొన్న విస్తృత చర్యలో భాగంగా ఆమెను అరెస్టు అరెస్టు చేశారు.
అక్టోబర్ 30న ఆమె సహోద్యోగి డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై అరెస్టు జరిగింది. తర్వాత షహీన్‌కు ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. గనై షాహీన్ స్విఫ్ట్ డిజైర్‌ను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు, దానిలో ఒక అస్సాల్ట్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు, దీనితో ఆమెకు నేరుగా సంబంధం ఉందని తేలింది.
పాస్‌పోర్ట్ దరఖాస్తుపై రెడ్ ఫ్లాగ్
షాహీన్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆమె సహచరులు తమ ప్రణాళికల అమలు చేసే క్రమంలో దొరికిపోవడంతో ఆమె దేశం విడిచి వెళ్లాలని అనుకున్నారట. ముందే ఫరీదాబాద్ పోలీసులు ఆమె కదలికలను గమనిస్తూ వచ్చారు. నవంబర్ 3న ఆమెను ఫోటో తీయడానికి అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ ప్రాంగణానికి ఒక అధికారిని కూడా పంపారు. ఈ ప్రయత్నాలు జరిగుతున్న క్రమంలోనే నవంబర్ 11న లక్నోలో షాహీన్‌ను అరెస్టు చేశారు.
ఈ కేసు చుట్టూ ఉన్న గందరగోళాన్ని ఫరీదాబాద్ పోలీసు అధికారి ఒకరు వివరించారు. “జమ్మూ & కశ్మీర్ పోలీసులు మొదట వివరాలను పంచుకోలేదు, అభ్యంతరకరమైన పోస్టర్లపై అల్-ఫలా విశ్వవిద్యాలయంలో ఒక డాక్టర్‌ను అరెస్టు చేయడానికి తాము అక్కడకు వెళ్లామని చెప్పారు. కొన్ని రోజుల తర్వాతే కేసు డెప్త్ ఏంటో మాకు తెలిసింది” అని అధికారి తెలిపారు.
ఆయుధాలు -పేలుడు పదార్థాలు లభ్యం
నవంబర్ 9న దర్యాప్తు ముమ్మరం చేశారు, ఫరీదాబాద్‌లోని రెండు అద్దె గదుల నుంచి పోలీసులు దాదాపు 3,000 కిలోల అమ్మోనియం నైట్రేట్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. షాహీన్ స్విఫ్ట్ డిజైర్‌లో లభించిన క్రింకోవ్ అస్సాల్ట్ రైఫిల్ ఆమె గురించి మరింత కీలకమైన సమాచారాన్ని అందించింది. కారును ఉపయోగిస్తున్న ముజమ్మిల్, అమ్మోనియం నైట్రేట్ నిల్వలను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారితో ఆమెకు ఉన్న సంబంధాన్ని నిర్దారితమైంది.
సెప్టెంబర్‌లో షాహీన్ పేరుతో నమోదు చేసిన, నవంబర్ 10 పేలుడు వెనుక 'వైట్-కోట్' టెర్రర్ మాడ్యూల్‌తో ముడిపడి ఉన్న మారుతి బ్రెజ్జాను అల్-ఫలాహ్ క్యాంపస్‌లో అధికారులు గుర్తించారు. షాహీన్ విచారణలో వాహనం అక్కడే పార్క్ చేసి ఉందని, దాని కీ కూడా తీసుకుని వచ్చారని ఫరీదాబాద్ పోలీసులు తెలిపారు. ముజమ్మిల్ నివసించిన టవర్ 17 సమీపంలో కారు దొరికింది.
మాడ్యూల్ నేతృత్వం వహిస్తున్న షాహీన్
అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేసే మాడ్యూల్‌లో షాహీన్ కీలక పాత్ర పోషించారని అధికారులు చెబుతున్నారు. “ఇందులో పాల్గొన్న వైద్యుల మధ్య వివాదాలు తలెత్తినప్పుడల్లా, వాటిని పరిష్కరించడానికి షాహీన్ జోక్యం చేసుకునేవారని. ఈ బృందం ప్రధానంగా వారి సొంత రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, వైద్యులను లక్ష్యంగా చేసుకుంది. అనేక మంది వ్యక్తులు వారి కనుసన్నల్లో ఉన్నారు.” అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
గత వారంలో, కేంద్ర సంస్థలు నుహ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాయి, వీరిలో ముగ్గురు MBBS వైద్యులు, ఎరువుల విక్రేత, ఒక మతాధికారి ఉన్నారు. గురువారం రాత్రి, ఫిరోజ్‌పూర్ ఝిర్కా నుంచి ఇద్దరు వైద్యులను అరెస్టు చేశారు. సునేహ్రాకు చెందిన ఒకరు చైనాలో MBBS పూర్తి చేసి నవంబర్ 2 వరకు అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్‌గా చేరాడు. మరొకరు అహ్మద్‌బాస్ గ్రామానికి చెందినవారు, విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థి కూడా. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలి 13 మంది మృతి చెందిన హ్యుందాయ్ i20 కారులో ఉన్న డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి ఇద్దరూ సన్నిహితులుగా ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ఫిరోజ్‌పూర్ ఝిర్కాలో కారు ఢిల్లీలోకి ప్రవేశించే ముందు CCTV ఫుటేజ్‌లో ఆ కారు కనిపించింది.
టౌరు పట్టణం నుంచి అదుపులోకి తీసుకున్న మూడో వైద్యుడు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అతను అల్-ఫలాహ్‌లో మాజీ విద్యార్థి. శుక్రవారం, NIA బృందాలు పినాంగ్వాన్‌తో సహా నుహ్‌లో దాడులు నిర్వహించి, 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ సరఫరా చేశాడనే ఆరోపణలతో ఎరువుల విక్రేతను అదుపులోకి తీసుకున్నాయి. విక్రేతకు ఎరువులు వ్యాపారం చేసే లైసెన్స్ ఉన్నప్పటికీ, వారు పెద్దమొత్తంలో కొనుగోలు ఉద్దేశ్యాన్ని ధృవీకరించడంలో విఫలమయ్యాడని పరిశోధకులు తెలిపారు.