Akasa Air flight:
అకాసా ఎయిర్ క్రాఫ్ట్‌లో ఘటన..
ఢిల్లీకి చెందిన Akasa Aircraft కి బాంబు బెదిరింపులు రావడం కాసేపు అలజడి సృష్టించింది. వెంటనే ఫ్లైట్‌ని ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 185 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్యాసింజర్స్‌లో ఒకరు తన బ్యాగ్‌లో బాంబు ఉందని చెప్పాడు. వెంటనే అలెర్ట్ అయిన సిబ్బంది ముంబయిలో ఫ్లైట్‌ని ల్యాండింగ్ చేసింది. పుణే నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఫ్లైట్ అర్ధరాత్రి 12 గంటలకు ముంబయిలో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన వెంటనే అక్కడికి Bomb Detection and Disposal Squads (BDDS) టీమ్ హుటాహుటిన వచ్చింది. ఆ ప్యాసింజర్ బ్యాగ్ చెక్ చేసింది. అందులో ఏమీ కనిపించకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. కావాలనే ఇలా చేశాడని గుర్తించారు. ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది ఆ ప్యాసింజర్‌పై సీరియస్ అయింది. అందరినీ ఇబ్బంది పెట్టినందుకు మండి పడింది. ఆ తరవాత అరెస్ట్ చేసింది.
"Akasa Air flight QP 1148 పుణే నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఓ ప్యాసింజర్ తన బ్యాగ్‌లో బాంబు ఉందని చెప్పాడు. వెంటనే అర్ధరాత్రి 12 గంటలకి ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యాం. ఈ సమయంలో ఫ్లైట్‌లో 185 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. సేఫ్‌టీ,సెక్యూరిటీ ప్రొసీజర్స్ ప్రకారం ముంబయికి మళ్లించాల్సి వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యి ఫ్లైట్‌లో తనిఖీలు జరిపాం. కానీ అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు"
- అకాసా ఎయిర్ లైన్స్
పోలీసుల విచారణ...
ఇలా బెదిరించిన ప్యాసింజర్ రిలేటివ్ కూడా అదే ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..ఆ ప్యాసింజర్ ఛాతీనొప్పి తగ్గేందుకు మందులు వేసుకున్నాడు. ఈ కారణంగానే కాస్త వింతగా ప్రవర్తించాడు. విచారణ పూర్తైన తరవాత ఫ్లైట్‌ని మళ్లీ ముంబయిలో టేకాఫ్ అయింది. ముంబయి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు.