Aditya L1 Mission Launch : చంద్రుడి సౌత్ పోల్ మీద ల్యాండర్ ను దింపి చరిత్ర సృష్టించిన భారత్ ఇప్పుడు సూర్యుడిని టార్గెట్ చేసింది. లగ్రాంజే పాయింట్ 1 నుంచి సూర్యుడిని నిరంతం గమనిస్తూ పరిశోధనలు చేయగలిగేలా డిజైన్ చేసిన ఈ ఆదిత్య L1 ఈ సెప్టెంబర్ 2 ఉదయం 11.50 నిమిషాలకు పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించనున్నారు. ఆదిత్య L1 ప్రత్యేకతలేంటీ తెలుసుకునేముందు అసలు సూర్యుడి మీద అంత ప్రత్యేకత ఏముంది. ఎందుకు ఇస్రో సూర్యుడిని టార్గెట్ చేసింది అనే విషయాలు చూద్దాం.
సూర్యుడిని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. హిందూపురాణాల్లో సూర్యభగవానుడు అంటారు. ప్రత్యక్షదైవం అని పూజలు కూడా చేస్తుంటారు. అరసవెల్లి, కోణార్క్ లాంటి చోట్ల సూర్యదేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ స్థాయిలో కల్చర్‌లో సూర్యుడు ఇంత ఇంక్లుండ్ అయిపోయాడంటే కారణం ఈ భూమి మీద ఇన్ని జీవులు బతకటానికి ప్రధాన కారణం సూర్యుడే. సూర్యుడే లేకపోతే మనకు బతకలగలిగే ఈ వాతావరణం ఏర్పడి ఉండేది కాదు..సూర్యుడే లేకపోతే కిరణజన్య సంయోగ క్రియ అనేది ఉండేదే కాదు. మన భూమి కూడా ఏదో మార్స్ లా కొండలు, గుట్టలు, రాళ్ల గ్రహంలా ఉండేది. సో ఆ కృతజ్ఞతే సూర్యుడిని మన లైఫ్ లో ఓ భాగంగా మార్చుకునేలా చేసింది. మరి అలాంటి సూర్యుడు అసలు ఏర్పడ్డాడు అంటే...
సూర్యుడు ఓ మీడియం సైజ్ నక్షత్రం. నిరంతం మండుతూ ఉన్నట్లు కనిపించే సూర్యుడు మన సూర్యకుటుంబానికి అధిపతి. మన సోలార్ ఫ్యామిలీలో సూర్యుడి చుట్టూ మిగిలిన గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. సూర్యుడి కోర్ లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగా శక్తి ఏర్పడి అది బయటకు వస్తూ ఉంటుంది. విజిబుల్ లైట్ లా, ఆల్ట్రా వయొలెట్ రేస్, ఇన్ ఫ్రారెడ్ రేస్ అంటూ సూర్యుడి నుంచి శక్తి రేడియేట్ అవుతూ ఉంటుంది. భూమి మీద మనందరి మనుగడకు ఇదే కారణం. భూమి కంటే 109 రెట్లు పెద్దగా ఉంటాడు సూర్యుడు. బరువు కూడా భూమి కంటే 3లక్షల 30వేల రెట్లు ఎక్కువ. మొత్తం సోలార్ సిస్టమ్ లో 99.86 శాతం బరువు సూర్యుడిదే అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్దదో. ఈ సూర్యుడిలో 73 శాతం హైడ్రోజనే. హీలియం ఓ 25శాతం ఉంటుంది. ఇంకా చిన్న మొత్తాల్లో కార్బన్, ఆక్సిజన్, నియాన్, ఐరన్ కూడా ఉంటాయి.
460 కోట్ల సంవత్సరాల క్రితం ఓ పెద్ద మాలిక్యులర్ క్లౌడ్ నుంచి సూర్యుడు ఏర్పడి ఉంటాడని శాస్త్రవేత్తల అంచనా. ఇప్పుడు సూర్యుడిలో ఉన్న శక్తి మొత్తం అయిపోవాలంటే ఇంకా 500 కోట్ల సంవత్సరాలు పడుతుంది. సో అప్పుడు వరకూ సూర్యుడు ఉంటాడు కాబట్టి మన భూమి కూడా ఉంటుంది. ప్రస్తుతం మిడిల్ ఏజ్ లో ఉన్న ఈ సూర్యుడి నుంచి నిరంతం ఇదిగో సోలార్ ఫ్లేర్స్ వస్తూ ఉంటాయి. ఇవే మొత్తం సౌర కుటుంబం అంతా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇంకా సూర్యుడిపై ఉన్న ఈ బ్లాక్ స్పాట్స్ ఇవి సూర్యుడి మీద మిగిలిన ప్రాంతంతో పోలిస్తే కూల్ గా ఉన్నాయన్నమాట. బట్ ఇవి పేలేందుకు అవకాశం కూడా ఉంటుంది.
సౌర తుఫానులు, సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు, ఆ రేడియేషన్ ఎనర్జీ ఇవన్నీ కాలిక్యులేట్ చేసి భూమి మీద ఉన్న ప్రజలను అప్రమత్తం చేయటానికి టెక్నాలజీని వాడటం అవసరం. సో అందుకోసమే శాస్త్రవేత్తలు సూర్యుడి మీద పరిశోధనల కోసం స్పేస్ క్రాఫ్ట్ లను వాడాలని డిసైడ్ అయ్యారు. అలా నాసా, యూరోపియన్ ఏజెన్సీస్ కలిసి సూర్యుడి పైన పరిశోధనల కోసం స్పేస్ ప్రోబ్స్ ను పంపించాయి.
Soho, Ace, Solar Dynamics Observatory లాంటి ఎన్నో ప్రయోగాలు సూర్యుడే లక్ష్యంగా చేశాయి ఈ రెండు స్పేస్ ఏజెన్సీలు. 2018 లో నాసా పంపిన పార్కర్ సోలార్ ప్రోబ్ 2021 లో సూర్యుడి అప్పర్ అట్మాస్పియర్ లో నుంచి ఫ్లై బై అయ్యింది. దీన్నే నాసా తొలిసారి సూర్యుడిని టచ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ అని ప్రకటించుకుంది. సూర్యుడి మాగ్నటిక్ ఫీల్డ్ ఇంకా ప్రపంచం అప్పటివరకూ సూర్యుడి ఫోటోలు తీసింది పార్కర్ ప్రోబ్.
ఆ తర్వాత ఆ స్థాయిలో ఘనతలు మరే దేశం సాధించలేదు. ఇప్పుడు భారత్ ఆదిత్య L1 ద్వారా లగ్రాంజే పాయింట్ కి చేరుకుని అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేయాలని భావిస్తోంది. 2008లో ఈ ఆలోచన వస్తే ఇన్ని సంవత్సరాలు మన సైంటిస్టులు కష్టపడి దాన్ని కంప్లీట్ రెడీ చేసి ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.