ABP Southern Rising Summit : సదరన్ రైజింగ్ సమ్మిట్‌ 2023లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కీలకమైన ఉపన్యాసం చేశారు. గవర్నర్ పాత్ర పునర్‌నిర్మాణం అనే అంశంపై మాట్లాడిన తమిళిసై ప్రజెంట్‌ ప్రభుత్వంతో జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. తెలంగాణలో ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు పెరిగిన దూరం అంశాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. గవర్నర్‌ను నాలుగు గోడలకే పరిమితం అయ్యేలా చేయడం సరికాదని వారికి కూడా ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. 


గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాలేరు: తమిళిసై
గవర్నర్‌గా నాలుగు గోడలకు పరిమితపై రబ్బర్ స్టాంపులా ఉండలేమని అన్నారు తమిళిసై. వైద్యురాలిగా ప్రజల నాడి తెలుసనని వారి బాగోగులు చూడటం కూడా గవర్నర్‌కు పాత్ర ఉండాలని తెలిపారు. సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధాలుండాలని చెప్పారు. దురదృష్టవశాత్తు తెలంగాణ సీఎంతో సంబంధాలు దెబ్బతిన్నాయని ఆమె గుర్తు చేశారు. 


గవర్నర్ పొలిటీషియన్ కాలేరు: తమిళిసై
దక్షిణాది రాష్ట్రాలకు సరైన అంచనాలు లేవని, దేశానికి చూపాల్సిన ప్రతిభ చూపడం లేదన్నారు తమిళిసై. రాజకీయ నాయకుడు గవర్నర్ కావొచ్చని కానీ గవర్నర్ రాజకీయ నాయకుడు కాలేరని సౌందర్ రాజన్ అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గవర్నర్‌లు వారధులుగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇబ్బంది పడకుండా తప్పులు జరగకుండా నివారించే బాధ్యత గవర్నర్‌లకు ఉంటుందన్నారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని సూచించారు. 






తాను గవర్నర్‌గా ప్రజల కోసం పని చేస్తున్నానని చెప్పారు. మార్పులుగా మనం భావించేవి కొందరికి రాజకీయ ఎత్తుగడలుగా అనిపించవచ్చు. ఇదీ గవర్నర్ ముందున్న సమస్య. గవర్నర్లే బాధ్యత వహించాలి. వాటిని వ్యతిరేకించకూడదన్నారు. 


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ అవసరం ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉండటం అవసరమా? ముఖ్యమంత్రులు గవర్నర్లను కలవడం మానేస్తున్నారు. నేను రాజకీయాలను మిస్ అవుతున్నాను. కానీ గవర్నర్ పదవి ద్వారా ప్రజలకు సాయం చేసే స్థితిలో ఉండటం సంతోషంగా ఉంది. నాపై విసిరిన రాళ్లతో కోటను నిర్మిస్తాను' అని అన్నారు.



ఏబీపీ సదరన్ రైజింగ్‌ సమ్మిట్‌ ప్రారంభం


ఏబీపీ సదరన్ రైజింగ్‌ సమ్మిట్‌ 2023 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, రాజకీయాల్లో మహిళల పాత్ర, గవర్నర్‌ పాత్ర, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఇలా చాలా అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. 


ఈ సమ్మిట్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ జ్వోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్‌ పాండే ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దక్షిణాది రాష్ట్రాల ప్రయాణం మానవ జాతికే స్ఫూర్తిగా ఉంటుందని కితాబు ఇచ్చారు. దక్షిణాది చాలా పురోభివృద్ధి సాధించిందన్నారు. దక్షిణ భారతదేశ చరిత్ర సంస్కృతి, ఆర్థిక పురోగతి, సామాజిక ఐక్యత సమ్మేళనమని అభిప్రాయపడ్డారు. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలు అత్యధిక జిడిపిని కలిగి ఉన్నాయని... ఆరోగ్య సంరక్షణ వంటి అంశాల్లో దక్షిణ, ఉత్తరాది మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉందని తెలియజేశారు.