President Of NBDA : ఏబీపీ నెట్‌వర్క్ సీఈఓ అవినాష్ పాండే శుక్రవారం న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్ (NBDA) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో NBDA వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అవినాష్ పాండే, ఇవాళ  జరిగిన NBDA నియామకాల బోర్డు సమావేశంలో అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. దిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశంలో NBDA 14వ వార్షిక నివేదికను  సమర్పించింది. ఇండిపెండెంట్ న్యూస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, ఎన్‌బీడీఏ ప్రస్తుత ప్రెసిడెంట్ రజత్ శర్మ ఆ పదవిని వదులుకున్నారు. మాతృభూమి ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ కో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.వీ శ్రేయామ్స్ కుమార్ ఎన్బీడీఏ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. న్యూస్24 బ్రాడ్‌కాస్ట్ ఇండియా లిమిటెడ్ ఛైర్‌పర్సన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అనురాధ ప్రసాద్ శుక్లా 2022-23 సంవత్సరానికి NBDA గౌరవ కోశాధికారిగా ఎన్నికయ్యారు.  


మార్పు కొనసాగిస్తా


ఎన్బీడీఏ అధ్యక్షుడిగా నియామకం అవ్వడంపై అవినాష్ పాండే మాజీ NBDA ప్రెసిడెంట్‌కి కృతజ్ఞతలు తెలుపారు. అవినాష్ పాండే మాట్లాడుతూ.."వార్తా పరిశ్రమలో ఉన్న వ్యూహాత్మక మార్పును పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా పెద్ద బాధ్యత. రజత్ జీ నాయకత్వం, కృషితో VUCA సమయంలో మమ్మల్ని నడిపించినందుకు ధన్యవాదాలు. ఎన్‌బీడీఏ సభ్యులు, బోర్డు వార్తా పరిశ్రమకు, సమాజానికి ఆ మార్పును కొనసాగిస్తుందని నేను విశ్వసిస్తున్నాను." అని అన్నారు. 


ఎన్నో సవాళ్లు 


నూతన నియామకాలపై రజత్ శర్మ మాట్లాడుతూ.. “గత కొన్ని సంవత్సరాలుగా న్యూస్ బ్రాడ్ కాస్టర్లు చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. NBDA ప్రతి సంక్షోభాన్ని జట్టుగా ఎదుర్కొని ప్రతి యుద్ధంలో విజయం సాధించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎన్‌బీడీఏలో నాతో చాలా సన్నిహితంగా పనిచేసిన అవినాష్‌కు అధ్యక్ష పదవిని అప్పగించడం ఆనందంగా ఉంది. ఇన్నేళ్లుగా మనం సమిష్టిగా నిర్మించుకున్న వారసత్వాన్ని అతను కొనసాగించాలి." అన్నారు. 


NBDA బోర్డులోని ఇతర సభ్యులు 


MK ఆనంద్, టైమ్స్ నెట్‌వర్క్ ఎండీ, సీఈవో  
రాహుల్ జోషి, MD - TV18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్
 ఐ.వెంకట్, దర్శకుడు ఈనాడు టెలివిజన్ ప్రై. లిమిటెడ్ 
కల్లి పూరీ భండాల్, వైస్-ఛైర్‌పర్సన్, ఎండీ- టీవీ టుడే నెట్‌వర్క్ లిమిటెడ్ 
సోనియా సింగ్, ఎడిటోరియల్ డైరెక్టర్, NDTV - న్యూ దిల్లీ టెలివిజన్ లిమిటెడ్ 
అనిల్ మల్హోత్రా, జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ 


2005 నుంచి ఏబీపీ గ్రూప్ లో 


ఏబీపీ గ్రూప్ లో 2005 నుంచి వివిధ పదవుల్లో సేవలందించిన అవినాష్ పాండే జనవరి 2019లో ABP నెట్‌వర్క్‌కి CEO అయ్యారు. మీడియా రంగంలో 26 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, టీవీ టుడే గ్రూప్ లో పనిచేశారు. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) ఇండియన్ చాప్టర్ బోర్డులో అవినాష్ పాండే కూడా ఉన్నారు.


Also Read : ABP Network with IIM Indore: నకిలీ వార్తలపై ఉమ్మడి పోరు- IIMతో ABP నెట్‌వర్క్ కీలక ఒప్పందం