Ideas of India: ABP 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సదస్సు ప్రారంభం- సరికొత్తగా ఆలోచిద్దాం రండి!

ABP Desam Updated at: 25 Mar 2022 12:11 PM (IST)
Edited By: Murali Krishna

'ఐడియా ఆఫ్ ఇండియా' ఫస్ట్ ఎడిషన్‌ సదస్సు నేడు ప్రారంభమైంది. ABP నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరగుతుంది.

ABP 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సదస్సు ప్రారంభం- సరికొత్తగా ఆలోచిద్దాం రండి!

NEXT PREV

Ideas of India: ABP నెట్‌వర్క్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 'ఐడియా ఆఫ్ ఇండియా' ఫస్ట్ ఎడిషన్‌ నేడు ముంబయిలో ప్రారంభమైంది. ABP నెట్‌వర్క్ సీఈఓ అవినాశ్ పాండే ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడానికి దేశం 75వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోబోయే ఈ ఏడాదే సరైన సమయమని అవినాశ్ అన్నారు. 







2022 ఏడాదిలో ఇప్పటికే ప్రపంచం కరోనా థర్డ్ వేవ్‌ను చూసింది. మూడో ప్రపంచ యుద్ధం ముప్పును ఎదుర్కొంటోంది. అలానే భారత్.. ఉత్కంఠభరితమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసింది. ప్రస్తుతం మనం ఓ అనిశ్చితమైన, ఉద్వేగపూరిత వాతావరణంలో ఉన్నాం. కానీ అలానే లెక్కలేనన్ని అవకాశాల మధ్య కూడా ఉన్నాం. ఇలాంటి వేళ దేశానికి కావాల్సిన గొప్ప ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. ఏ అంశంపైనైనా చర్చించేందుకు, వాదించేందుకు, నిజం తెలుసుకునేందుకు దేశం సిద్ధంగా ఉంటుంది. ABP నెట్‌వర్క్‌ కూడా అదే నమ్ముతుంది. ఎప్పుడూ నిజం వైపు నిలబడేందుకే మేం కృషి చేస్తాం. టీఆర్‌పీల వెంట మేం పరుగుపెట్టం. ప్రజల హృదయాలను కదిలించాలని చూస్తాం. మాకు ఎంతమంది వీక్షకులు ఉన్నారని మేం ఎప్పుడూ ఆలోచించలేదు. వారిని ఆకట్టుకోవడానికే ప్రయత్నించాం. న్యూస్.. జీవితాలను మార్చగలదు.                                                                    - అవినాశ్ పాండే, ABP నెట్‌వర్క్ సీఈఓ


2 రోజులు


ABP ఆధ్వర్యంలో జరిగే ఈ రెండు రోజుల సదస్సులో పలు కీలక విషయాలపై గొప్ప తాత్వికవేత్తలు, మనోవికాస నిపుణులు వారి ఆలోచనలు పంచుకోబోతున్నారు. ముఖ్యమైన అంశాలు ఇవే



  1. జాతీయవాదం, ప్రపంచీకరణ

  2. అల్గారితం, ఎమోషనల్ ఇంటిలిజెన్స్ మధ్య కంటెస్ట్,

  3. సుస్థిర అభివృద్ధి,

  4. డిజిటల్ డిక్టేటర్‌షిప్ vs డిజిటల్ డెమోక్రసీ

  5. భారత దేశ చరిత్ర


లక్ష్యం


వివిధ రంగాలకు చెందిన విజనరీ లీడర్స్‌ను ఒకే వేదికపైకి తీసుకువచ్చి దేశానికి ఉపయోగపడే ఐడియాలపై చర్చించడమే ఈ రెండు రోజుల సదస్సు ముఖ్య ఉద్దేశం. 75 ఏళ్ల స్వతంత్రాన్ని దేశం పూర్తి చేసుకున్న వేళ భారత్‌.. ప్రపంచానికే ఆదర్శంగా నిలవడానికి గల గొప్పదనం గురించి కూడా వక్తలు మాట్లాడనున్నారు. అలానే దేశాన్ని అన్ని రంగాల్లో ఇంకా వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి కావల్సిన ఆలోచనలపై వక్తలు చర్చించనున్నారు. మార్చి 25, 26 ఈ సదస్సు జరగనుంది.



Also Read: Birbhum Violence Case: బంగాల్ హింసాకాండపై సీబీఐ దర్యాప్తు- కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం


Also Read: Wooden Treadmill: ఉడెన్ ట్రెడ్‌ మిల్‌ చూసిన ఆనంద్‌ మహేంద్ర ఫిదా- ఒకటి పంపించాలంటూ శ్రీనివాస్‌కు రిక్వస్ట్


 

Published at: 25 Mar 2022 12:11 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.