Maha Kumbh 2025 at Prayagraj | ప్రయాగ్‌రాజ్: పవిత్రమైన భోగి పర్వదినాన మహా కుంభమేళా ప్రారంభమైంది. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ బాట పట్టారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించాలని, తమకు అంతా మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఏడాది దాదాపు 40 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాకు తరలి వస్తారని అంచనా వేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకుగానూ ఏర్పాట్లు చేశాయి. మహాకుంభమేళాలో విదేశీ భక్తులు సందడి చేస్తున్నాయి. మన దేశానికి చెందిన భక్తుల తరహాలోనే వారు కూడా పుణ్య స్నానాలు ఆచరించేందుకు పోటీ పడుతున్నారు.

Continues below advertisement


మేరా భారత్ మహాన్, ఐ లవ్ ఇండియా


ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచే కాదు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద భక్తులు గడ్డకట్టే చలిలోనూ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రష్యా నుంచి మహా కుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు చాలా ఎగ్జైట్ అయ్యారు. మేరా భారత్ మహాన్, ఐ లవ్ ఇండియా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో ఆమె ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ చాలా గొప్ప దేశం. తొలిసారి కుంభమేళాకు వచ్చాను. దేశ ప్రజలలో అసలైన భక్తితో కూడిన శక్తి దాగి ఉంది. ఇక్కడ భక్త జనసంద్రాన్ని చూడగానే నాలో ఒక్కసారిగా వణుకు వచ్చింది. కుంభమేళాలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ లవ్ ఇండియా అని’ ఆమె అన్నారు.






కుంభమేళా చాలా పవర్ ఫుల్


దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు చెందిన నిక్కీ అనే భక్తురాలు మాట్లాడుతూ.. కుంభమేళా చాలా పవర్ ఫుల్ అని, గంగా నది చెంతకు చేరినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. స్పెయిన్ నుంచి ఓ భక్తుడు మహాకుంభమేళాకు హాజరయ్యారు. తాను తన దేశం స్పెయిన్‌తో పాటు బ్రెజిల్, పోర్చుగల్ నుంచి కొందరు స్నేహితులతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా భారత్‌లోని కుంభమేళాకు వచ్చామన్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేశాం. ఇలాంటి ప్రాంతాన్ని సందర్శించినందుకు చాలా సంతోషంగా ఉంది. మేం చాలా అదృష్టవంతులం అన్నారు.






Also Read: Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, తొలిరోజే జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం