జమ్మూ ప్రాంతంలోని ఉదంపూర్ పట్టణం పేలుడు భయభ్రాంతులకు గురి చేసింది. ఉదంపూర్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ వెలుపల ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
ఉదంపూర్ పేలుడులో మొత్తం 15 మంది గాయపడ్డారని, వారిలో ఒకరు గాయాలతో మరణించారని ANI వార్తాసంస్థకు ఒక వైద్యుడు తెలియజేశాడు.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, పేలుడు తీవ్రతను తదుపరి విచారణలో వెల్లడిస్తామన్నారు జమ్మూ & కశ్మీర్ ఎస్‌ఎస్పీ వినోద్ కుమార్ విలేకరులకు తెలిపారు.
ఉదంపూర్‌లోని స్లాథియా చౌక్ సమీపంలో పేలుడు జరిగినట్లు పోలీసులు కూడా సమాచారం అందించారు.