హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ బయలాజికల్ ఈ తయారుచేసిన కొర్బెవాక్స్ వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఐదేళ్ల నుంచి పన్నెండేళ్ల వయసు వారికి వేసేందుకు దీన్ని రెడీ చేస్తున్నారు. బయలాజికల్ ఈ ని అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకుందా సంస్థ.
బయలాజికల్ ఈ వ్యాక్సిన్ కొర్బెవాక్స్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీకి ఆ సంస్థ అందించినట్టు ఏఎన్‌ఐ పేర్కొంది. పన్నెండేళ్ల నుంచి పద్దెనిమదేళ్ల మధ్య వయసున్న వాళ్లకు కోర్బెవ్యాక్స్ వేసేందుకు ఫిబ్రవరిలో డీసీజీఏ ఆమోదించింది. కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్టు బయలాజికల్ ఈ పేర్కొంది.
కొర్బెవాక్స్‌కు సంబంధించిన ఫైనల్ అనుమతి త్వరలోనే వస్తుందని బయలాజికల్ ఈ సంస్థ తెలిపింది. భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను చూసిన తర్వాత మాత్రమే EUAకి SEC సిఫార్సు చేసింది.
ఈ వ్యాక్సిన్‌కు పన్నులు మినహాయించి రూ.145 ఖర్చవుతుందని అంచనా. నిర్ణీత వ్యవధిలో రెండు సార్లు లబ్ధిదారులకు కొర్బెవాక్స్ ఇవ్వనున్నారని ఏఎన్‌ఐ చెబుతోంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు కోట్ల కార్బెవాక్స్ వ్యాక్సిన్ డోస్‌లను కొనుగోలు చేసి కొన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసిందని అధికారిక వర్గాలు ఏఎన్‌ఐకి తెలిపాయి.
సెప్టెంబర్ 2021లో, బయోలాజికల్ E ఫేజ్ II మరియు ఫేజ్ III క్లినికల్ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసింది. బయోలాజికల్ ఈ కొర్బెవాక్స్ తొలిసారి స్వదేశీంగా అభివృద్ధి చేసిన రిసెప్టర్-బైండింగ్ డొమైన్ (RBD) ప్రోటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్. ఆర్‌బీడీ అనేది సార్స్-కొవ్-2 స్పైక్ ప్రోటీన్‌లో భాగం. వైరస్ స్పైక్ ప్రొటీన్‌ను హోస్ట్ సెల్‌లకు అటాచ్ చేసుకుంటుంది.
కోవ్యాగ్జిన్, జైడస్ క్యాడిలాకు చెందిన జైకోవ్-డీ తర్వాత భారత్‌లో తయారవుతున్న మూడో వ్యాక్సిన్ కొర్బెవాక్సిన్. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం చేసిన ప్రకటన ప్రకారం గడిచిన 24 గంటల్లో, భారతదేశంలో 4,575 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 18.69 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.