పశ్చిమ పసిఫిక్ సముద్రంలో 2021 మలబార్ విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాల్లో ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ శివాలిక్, కద్మత్ యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. శివాలిక్ నౌకకు కెప్టెన్‌గా కపిల్ మెహతా, కద్మత్‌కు కెప్టెన్‌గా ఆర్‌కె మహారాణా వ్యవహరించనున్నారు. బంగాళాఖాతంలో నాలుగు దేశాల మధ్య నిర్వహించనున్న మలబార్ 21 నౌకాదళ సముద్ర విన్యాసాలు.. ఈ రోజు (ఆగస్టు 26న) నుంచి ఈ నెల 29 వరకు జరుగుతాయి. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలు మలబార్ 21 నౌకాదళ సముద్ర విన్యాసాల్లో పాల్గొంటాయి.
భారత్, అమెరికా మధ్య నౌకాదళ విన్యాసాలకు సంబంధించి 1992లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఇండియా, అమెరికా దేశాలు మలబార్ సిరీస్ పేరిట నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. 2015లో జపాన్ నేవీ ఇందులో భాగం కాగా.. 2020లో ఆస్ట్రేలియా కూడా జతచేరింది. సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం ఈ నౌకాదళ విన్యాసాలు తోడ్పడతాయి.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో..
శివాలిక్, కద్మత్ అనే రెండు యుద్ధ నౌకలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. వీటిలో పలు ఆయుధాలు, సెన్సార్‌లు ఉన్నాయి. ఇవి మల్టీ రోల్ హెలికాప్టర్‌లను తీసుకెళ్లగలవు. భారతదేశ యుద్ధనౌక నిర్మాణ సామర్ధ్యాల పెరుగుదలను సూచికలుగా ఇవి విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. విన్యాసాల్లో భాగంగా ఉపరితలం, గాలిలో వెపన్ ఫైరింగ్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.
Also Read: Shashi Tharoor Memes: శశి థరూర్ పై ఈ ఫన్నీ మీమ్స్ చూశారా..? పొట్ట చెక్కలవ్వాల్సిందే