Corona Cases: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 12,751 కరోనా కేసులు నమోదయ్యాయి. 42 మంది కరోనాతో మృతి చెందారు. పాజిటివిటీ రేటు 3.50 శాతంగా నమోదైంది.






కొవిడ్​ నుంచి తాజాగా 16,412 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.51 శాతానికి చేరుకుంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.30 శాతంగా ఉన్నాయి.



  • మొత్తం కేసులు: 4,41,74,650

  • మొత్తం మరణాలు: 5,26,772

  • యాక్టివ్​ కేసులు: 1,31,807

  • కోలుకున్నవారి సంఖ్య: 4,35,16,071


వ్యాక్సినేషన్ 






దేశంలో కొత్తగా 31,95,034 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 206.88 కోట్లు దాటింది. మరో 3,63,855 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.


చిన్నారుల్లో


పెద్దలతో పోల్చితే పిల్లలపై కరోనా తక్కువగానే ప్రభావం చూపింది. వారికీ వైరస్ సోకినప్పటికీ ప్రాణాపాయ స్థితి రాలేదు. కానీ దీర్ఘకాలంగా చూస్తే వారి ఆరోగ్యంపై మాత్రం కచ్చితంగా ప్రభావం పడుతోందని అంటున్నారు వైద్యులు. తలనొప్పి, మూడ్ స్వింగ్స్, నీరసం, పొత్తి కడుపు నొప్పి లాంటి లక్షణాలు వారిలో కనిపించాయని తాజాగా లాన్సెట్ నివేదిక వెల్లడించింది. లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలపై ఇటీవలే అధ్యయనం చేసిన లాన్సెట్ ఈ వివరాలు ప్రచురించింది. 


అనారోగ్యం


కొవిడ్ సోకిన పిల్లల్లో మూడింట ఓ వంతు పిల్లల్లో ఈ అనారోగ్య లక్షణాలు కనిపించినట్టు తేల్చి చెప్పింది. చిన్నారుల ఆరోగ్యం, విద్య, జీవనశైలిపై కరోనా ఎలాంటి ప్రభావం చూపిందనే అంశంపై అధ్యయనం చేపట్టారు పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతపై వైరస్ ప్రభావం తక్కువే అయినా, పోస్ట్ కొవిడ్ సమస్యలు మాత్రం అధికంగానే ఉన్నాయని చెబుతున్నారు సైంటిస్ట్‌లు.


ప్రస్తుతానికి ఈ బాధితుల సంఖ్య తక్కువగానే ఉన్నా వీలైనంత త్వరగా సంరక్షణా చర్యలు చేపట్టాలని సూచించారు. పిల్లలపై లాంగ్ కొవిడ్‌ ప్రభావంపై ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. కరోనా సోకిన వారిని దాదాపు రెండు నెలల పాటు ఏదో ఓ అనారోగ్య సమస్య వెంటాడుతోందన్నది కొందరు పరిశోధకులు చెబుతున్న మాట 2020 జనవరి నుంచి జులై 2021 వరకూ కరోనా సోకిన పిల్లలపై పరిశోధన జరిపిన తరవాతే ఈ విషయాన్ని నిర్ధరించారు. 


Also Read: Mother and Son Govt Jobs: ఆ తల్లీ కుమారుడు అదుర్స్, ఒకేసారి ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు


Also Read: Ticket booking: ఐదు నిమిషాల ముందే రైలులో టికెట్ బుక్ చేస్కోవచ్చు!