కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 93 లక్షల మందికి పైగా టీకాలను అందించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా శుక్రవారం ఈ ఘనత సాధించింది. ఒకే రోజులో ఇంత భారీ సంఖ్యలో టీకాలు ఇవ్వడం ఇదే మొదటి సారి. వీటితో కలిపి దేశవ్యాప్తంగా 62 కోట్ల మందికి పైగా కోవిడ్ టీకాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్లడించింది.


కాగా, దేశంలో వరుసగా రెండో రోజు 44,658 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,26,03,188కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారిలో 496 మంది మరణించారు. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4.36 లక్షలకు చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,44,899 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 





 










Also Read: AP Covid Cases: ఏపీలో కొత్తగా 1515 కోవిడ్ కేసులు.. రాష్ట్రంలో రెండు డోసుల టీకా ఎంత మందికి అయిందంటే?


Also Read: Bridge Collapse Dehradun: ఒక్కసారిగా కూలిపోయిన బ్రిడ్జి.. నదిలో చిక్కుకున్న వాహనాలు