India-Nepal Relations: 



ప్రచండ భారత్ పర్యటన 


నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ (Nepal PM) భారత్ పర్యటనకు వచ్చారు. ఢిల్లీలో ప్రధాని మోదీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడేందుకు రామాయణ సర్క్యూట్ (Ramayana Circuit) ప్రాజెక్ట్‌ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కొత్త రైల్వే లింక్స్‌ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాల (India Nepal Relations) మధ్య ఒప్పందం కుదిరినట్టు వెల్లడించారు. 


"కొన్ని కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాం. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ పెరిగేందుకు కొత్త రైల్‌ లింక్స్‌ ఏర్పాటు చేశాం. దీర్ఘకాలిక పవర్ ట్రేడ్ అగ్రిమెంట్‌ కూడా కుదిరింది. ఇరు దేశాల పవర్ సెక్టార్‌కి ఇది చాలా తోడ్పడుతుంది. భారత్, నేపాల్ మధ్య బంధం ఇప్పటిది కాదు. సాంస్కృతికంగా ఈ రెండు దేశాలు ఎప్పటి నుంచో అనుసంధానమై ఉన్నాయి. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు రామాయణ సర్క్యూట్ ప్రాజెక్ట్‌ని డెవలెప్ చేయాలని భావిస్తున్నాం"


- ప్రధాని నరేంద్ర మోదీ 






అంతకు ముందు ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని ప్రచండ...బఠండ-నేపాల్ కస్టమ్ యార్ట్‌ కార్గో ట్రైన్‌కి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో ఇద్దరూ కీలక చర్చలు జరిపారు.  ప్రచండతో మాట్లాడిన సందర్భంలో ప్రధాని మోదీ తాను తొలిసారి నేపాల్ పర్యటనకు వెళ్లిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. భారత్-నేపాల్ మధ్య సంబంధాలు "హిట్ ఫార్ములా"తో కొనసాగుతున్నాయని తేల్చి చెప్పారు. అటు నేపాల్ ప్రధాని ప్రచండ కూడా సరిహద్దు సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రధాని మోదీని కోరారు. అంతే కాదు. వీలైనంత త్వరలో నేపాల్ పర్యటనకు రావాలని మోదీని ఆహ్వానించారు. 


"9 ఏళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి నేపాల్ పర్యటనకు వెళ్లాను. ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి. అప్పుడే భారత్- నేపాల్ బంధానికి నేనో హిట్ ఫార్ములా చెప్పాను. ఇప్పుడు అది నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది. భారత్ నేపాల్ మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని ఆకాంక్షిస్తున్నానుర. సరిహద్దు వివాదాలూ సమసిపోతాయని భావిస్తున్నాను. సరిహద్దులు ఎప్పుడూ మాకు ఆటంకాలు కాలేవు"


- ప్రధాని నరేంద్ర మోదీ


భారత్‌తో 1,850 కిలోమీటర్ల మేర సరిహద్దు పంచుకుంటోంది నేపాల్. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బిహార్, యూపీ, ఉత్తరాఖండ్...ఈ 5 రాష్ట్రాలతోనూ నేపాల్‌ సరిహద్దు సమీపంలో ఉన్నవే. 1950 నుంచే ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. 


Also Read: Aircraft Crash: పంట పొలాల్లో కుప్ప కూలిన ఎయిర్‌ క్రాఫ్ట్, పైలట్‌లకు గాయాలు