Aircraft Crash:
కర్ణాటకలో ఘటన..
కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్ప కూలింది. కూలగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో అందులో ఇద్దరు పైలట్‌లు ఉన్నారు. ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయని, సురక్షితంగా ఉన్నారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బెంగళూరుకు 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామ్‌రాజ్‌నగర్‌లో రొటీన్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి పంట పొలాల్లో కూలిపోయింది. ఈ క్రాష్‌కి కారణమేంటన్నది మాత్రం ఇంకా తేలలేదు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు.
"కిరణ్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ మకాలి గ్రామంలోని చామ్‌రాజ్‌నగర్ వద్ద పంటపొలాల్లో కుప్ప కూలింది. ప్రమాద సమయంలో ఇద్దరు పైలట్‌లు ఉన్నారు. వీరిలో ఓ మహిళా పైలట్ కూడా ఉన్నారు. ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమేంటో విచారణ జరపుతాం"
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్