India Maldives Tensions:
జైశంకర్ భేటీ..
భారత్, మాల్దీవ్స్ మధ్య విభేదాలు (India Maldives Row) కొనసాగుతున్న క్రమంలోనే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో భేటీ అయ్యారు. ఉగాండా రాజధాని కంపాలాలో ఈ సమావేశం జరిగినట్టు జైశంకర్ వెల్లడించారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. భారత్, మాల్దీవ్స్ మధ్య ద్వైపాక్షిక బంధంపై చర్చ జరిగినట్టు వివరించారు. రెండు రోజుల పాటు జరిగే Non-Aligned Movement (NAM) సమ్మిట్‌లో పాల్గొనేందుకు కంపాలా వెళ్లిన జైశంకర్...జమీర్‌తో ప్రత్యేకంగా చర్చించారు.
"మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో కంపాలాలో సమావేశం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంపై చర్చించాం. దీంతో పాటు NAM కి సంబంధించిన చర్చలూ జరిపాం"
- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
స్పందించిన మూసా జమీర్
ఈ ట్వీట్‌కి మూసా జమీర్ స్పందించారు. జైశంకర్‌ని కలవడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. X వేదికగా పోస్ట్ పెట్టారు. మాల్దీవ్స్‌లో భారతీయ సైనికులను ఉపసంహరించుకోవాల్సిన అంశంపైనా చర్చించినట్టు తెలిపారు. తమ దేశానికి అందించాల్సిన సహకారంపైనా చర్చ జరిగినట్టు చెప్పారు.
"భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అవడం ఆనందంగా ఉంది. ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి. మాల్దీవ్స్‌లో భారతీయ సైనికులను ఉపసంహరించుకోవాలన్న అంశాన్ని ప్రస్తావించాను. అంతే కాకుండా మాల్దీవ్స్‌లో పెండింగ్‌లో డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌ని పూర్తి చేసేందుకు తోడ్పడాలని కోరాను. SAARC, NAM లో సహకరించాలని విజ్ఞప్తి చేశాను. మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం"
- మూసా జమీర్, మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ చైనా పర్యటన ఈ అలజడిని మరింత పెంచింది. దాదాపు ఐదు రోజుల పాటు అక్కడే పర్యటించిన ముయిజూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమది చిన్న దేశమే అన్న చిన్న చూపు చూడొద్దని, అలాంటి కవ్వించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. అయితే...భారత్ పేరు ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే పరోక్షంగా భారత్ గురించే ఈ కామెంట్స్ చేశారన్న చర్చ గట్టిగానే జరుగుతోంది.
"మాది చూడడానికి చిన్న దేశమే కావచ్చు. అలా అని మమ్మల్ని కవ్వించే హక్కు ఎవరికీ లేదు. ఎవరూ చిన్న చూపు చూడాల్సిన పని లేదు. మా దేశాన్ని మేము అతి పెద్ద ఎకనామిక్ జోన్‌గా చూస్తున్నాం. మా చుట్టూ ఉన్న సముద్రం మాదే. అది వేరే ఏ దేశానికీ చెందినది కాదు. మేం ఎవరి దగ్గరా చేయి చాచడం లేదు. మాకు ఎవరి అండా అవసరం లేదు. మాదో స్వతంత్ర ప్రాంతం"
- మహమ్మద్ ముయిజూ, మాల్దీవ్స్ అధ్యక్షుడు
Also Read: Coaching Centres: శిక్షణ సంస్థల మోసాలకు చెక్, మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం