ఇరు దేశాల మధ్య శాంతిని పెంపొందించేందుకు, చర్చలు జరిపే అవకాశాన్ని కల్పించేందుకు భారత్, చైనా రెండూ అంగీకరించాయి. మిలిటరీ, దౌత్య మార్గాల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు, చర్చలు కొనసాగించడానికి పరస్పర ఆమోదం తెలిపాయి. వీలైనంత త్వరగా మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. - అరిందమ్ బాగ్చి, భారత విదేశాంగ ప్రతినిధి