India-China Faceoff: సరిహద్దులో భారత్- చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ రంగలోకి దిగారు. ఈ ఘర్షణపై ఉన్నత స్థాయి సమావేశానికి రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు.


ఇదీ జరిగింది


భారత్, చైనా సరిహద్దులో ఇటీవల మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 9న భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని LAC సమీపంలో భారత్- చైనా సైనికులు ఘర్షణ పడ్డినట్లు సమాచారం. ఈ ఘర్షణలో ఇరు దేశ సైనికులు స్వల్పంగా గాయపడ్డారు.


డిసెంబర్ 9న చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని LAC దాటి రావడంతో భారత దళాలు వారిని అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన కొంతమంది సిబ్బందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత ఇరు దేశ సైనికులు ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.






ఈ ఘర్షణలో 30 మందికి పైగా భారత సైనికులు గాయపడ్డారని ABP న్యూస్‌కి పలు సోర్సెస్ ద్వారా తెలిసింది. తవాంగ్ సెక్టార్‌లో జరిగిన ఘర్షణలో గాయపడిన ఆరుగురు సైనికులను చికిత్స కోసం గౌహతికి తీసుకువచ్చినట్లు పీటీడీ నివేదించింది. చైనా వైపున గాయపడిన సైనికులు భారత్ కన్నా ఎక్కువ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


"తవాంగ్‌లోని భారత సైనికులు చైనా సైనికులకు తగిన సమాధానం ఇచ్చారు. గాయపడిన చైనా సైనికుల సంఖ్య భారత సైనికుల కంటే ఎక్కువ. దాదాపు 300 మంది సైనికులతో చైనీయులు భారీగా ఎల్ఏసీ వద్దకు వచ్చారు. అయితే భారత సైనికులు వారిని వీరోచితంగా ఎదుర్కొన్నారు." సైనిక వర్గాలు పేర్కొన్నాయి. కొంత సేపటి తర్వాత ఇరువర్గాలు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారని విశ్వసనీయం సమాచారం.


మరోసారి


లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత మరోసారి సరిహద్దులో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల సైనికులు మళ్లీ ఘర్షణకు దిగాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. ఇరువైపులా ఎవరూ మరణించినట్లు నివేదికలు లేనప్పటికీ, కొంతమంది భారత సైనికులకు గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం సమస్యను చర్చించడానికి భారత కమాండర్ తన కౌంటర్‌ పార్ట్ చైనా అధికారితో ఫ్లాగ్ మీటింగ్‌ను నిర్వహించారు. 


అరుణాచల్‌లో


హిల్ స్టేట్స్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వివాదాస్పద సరిహద్దులో ఇరుపక్షాల మధ్య ఈ ఘర్షణ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్‌కు ఈశాన్యంగా 35 కిమీ దూరంలోని యాంగ్ట్సే వద్ద అక్టోబర్ 2021లో ఇలాంటి ఘర్షణే జరిగింది. 17,000 అడుగుల శిఖరాన్ని చేరుకోవడానికి చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్‌ అప్పట్లో అడ్డుకుంది. ఈ ప్రాంతం ఇప్పుడు మంచుతో కప్పి ఉంది. మార్చి నెల వరకు అలాగే ఉంటుంది. తూర్పు లద్దాఖ్‌లోని రించెన్ లా సమీపంలో ఆగస్టు 2020 ఘర్షణ తర్వాత ఈ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య ఇది ​​మొదటి భౌతిక ఘర్షణగా తెలుస్తోంది.


Also Read: ఒక్క నిమిషం వ్యాయామం చేస్తే, చావు త్వరగా రాదట - ఈ వ్యాధులన్నీ పరార్!