భారత్-సెంట్రల్ ఆసియా తొలి సదస్సుకు వర్చువల్‌గా నేతృత్వం వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సమావేశంలో వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, అనుసంధానం, పరస్పర సహకారం, భాగస్వామ్యం, సంస్కృతిపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, తుర్కెమినిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాంతీయ భద్రత, స్థిరత్వం, శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని మోదీ అన్నారు.
- ప్రాంతీయ భద్రత, శ్రేయస్సుకు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం. సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్‌కు సెంట్రల్ ఆసియా కేంద్రంగా ఉంది.
- దేశాల మధ్య సహకారానికి సమర్థవంతమైన విధానం ఉండాలి. అది.. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర చర్యల కోసం ఒక వేదిక ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది.
- దేశాల మధ్య సహకారానికి ప్రతిష్ఠాత్మత్మకమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయటం. ఇది ప్రాంతీయ అనుసంధానత, సహకారం కోసం సమగ్ర విధానాన్ని అవలంబించడానికి వీలు కల్పిస్తుంది.
భారత్, సెంట్రల్ ఆసియా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు 30 ఏళ్లు ఫలప్రదంగా పూర్తిచేసుకున్నాయని మోదీ అన్నారు. సెంట్రల్ ఆసియా దేశాలతో భారత్‌కు స్థిరమైన సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు.
Also Read: Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!
Also Read: Arunachal Boy Missing Case: అరుణాచల్ ప్రదేశ్ బాలుడ్ని భారత ఆర్మీకి అప్పగించిన చైనా