ఏపీలో కరోనా ఉగ్రరూపం చూపుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 41,771 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 13,474 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో తొమ్మిది మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,579కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 10,290 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,11,975 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1,09,493 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
లక్ష దాటేసిన యాక్టివ్ కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,36,047కి చేరింది. గడిచిన 24 గంటల్లో 10,290 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1,09,493 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,579కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,23,25,140 శాంపిల్స్ పరీక్షించారు.
Also Read: దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదు.. 573 మంది మృతి
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,03,71,500కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 4,91,700కు చేరింది. మరో 573 మంది వైరస్‌తో మృతి చెందారు.
- యాక్టివ్ కేసులు: 22,02,472
- మొత్తం కేసులు: 4,03,71,500
- మొత్తం మరణాలు: 4,91,700
- మొత్తం కోలుకున్నవారు: 3,76,77,328
మొత్తం కేసుల సంఖ్యలో యాక్టివ్ కేసుల శాతం 5.46గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 22,02,472కు తగ్గింది. రికవరీ రేటు 93.33 శాతంగా ఉంది.
మార్కెట్లో కోవిషీల్డ్, కోవాగ్జిన్
దేశీయ కరోనా టీకా కొవాగ్జిన్ సహా మన దేశంలో తయారైన కొవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఈ మేరకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. అయితే కరోనా టీకాలు మెడికల్ స్టోర్స్‌లో లభించవు. కానీ ఆసుపత్రులు, క్లినిక్స్ కావాలంటే కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ప్రతి ఆరు నెలలకోసారి వ్యాక్సినేషన్ డేటాను డీసీజీఐకు నివేదించాలి. అలానే కొవిన్ యాప్‌లో కూడా అప్‌డేట్ చేయాలి.
ఇప్పటికే టీకాల ధరలను నిర్ణయించనున్నాయి ఆయా ఫార్మా సంస్థలు. సాధారణంగా టీకా ధర బహిరంగ మార్కెట్లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికావర్గాలు పేర్కొన్నాయి. అయితే.. దీనికి రూ.150 సేవా రుసుమ అదనంగా తీసుకునేందుకు అవకాశం ఉంది.