Independence Day 2022: 


ఎంట్రెన్స్ వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్


ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధమవుతోంది. ఈ సారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మరింత ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేదికగానే జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అందుకే..ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సారి అంచెల వారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 7 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు చెబుతున్నారు. ఎర్రకోట ఎంట్రెన్స్ వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 10 వేల మంది పోలీసులు కోట చుట్టూ పహారా కాస్తారు. 400 మంది కైట క్యాచర్స్‌ని నియమించనున్నారు. ఎర్రకోట చుట్టు పక్కల అనుమానాస్పదంగా బెలూన్లు కానీ... పతంగులు కానీ ఎగిరితే వెంటనే వాటిని పసిగట్టటం వీరి పని. పరిసరాలన్ని సెన్సిటివ్ ఏరియాల్లోనూ పోలీసులు నిఘా పెట్టనున్నారు. ఎర్ర కోటకు చుట్టుపక్కల 5 కిలోమీటర్ల మేర "నో కైట్ ఫ్లైయింగ్ జోన్‌"గా ప్రకటించనున్నారు. త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయ్యేంత వరకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయి. 


దిల్లీ వ్యాప్తంగా యాంటీ డ్రోన్‌లు..


డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహా ఇతర భద్రతా సంస్థలు తయారు చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్స్‌ని దిల్లీ వ్యాప్తంగా ఏర్పాటు డిప్లాయ్ చేయనున్నారు. "ఎర్రకోట వద్ద హై రెజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేశాం. వాటిని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఈ సారి విజిటర్స్ సంఖ్య 7 వేలకు పెరిగింది. అందుకే...ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశాం" అని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. లంచ్‌ బాక్స్‌లు, వాటర్ బాటిల్స్, రిమోట్ కంట్రోల్డ్ కార్‌ కీస్, సిగరెట్ లైటర్స్, బ్రీఫ్‌కేసెస్, కెమెరాలు, గొడుగులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని వివరించారు. ఇప్పటికే దిల్లీలో 144సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. స్వాతంత్య్ర వేడుకల సమయంలో ఎవరైనా పతంగులు, బెలూన్‌లు ఎగరేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. 


హై స్పెసిఫికేషన్ కెమెరాలు కూడా..


దిల్లీలో శుక్రవారం 2,200 క్యాట్‌రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్‌ విహార్‌ ఇంటర్ స్టేట్ బస్ టర్మినల్ వద్ద ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో దిల్లీ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని చోట్లా నిఘా పెంచారు. IED దాడులు జరిగే అవకాశముందన్న ముందు జాగ్రత్తతో తనిఖీలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొంత మంది పోలీస్ సిబ్బందికి శిక్షణనిచ్చారు. నార్త్, సెంట్రల్, న్యూ దిల్లీ జిల్లాల్లో దాదాపు వెయ్యి హై స్పెసిఫికేషన్ కెమెరాలు ఇన్‌స్టాల్ చేయనున్నారు. ఈ కెమెరాల ద్వారానే వీవీఐపీ రూట్స్‌ని పర్యవేక్షించనున్నారు. రెస్టారెంట్‌లు, హోటల్స్, లాడ్జ్‌లనూ తనిఖీ చేస్తున్నారు. జులై 22వ తేదీనే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. పారాగ్లైడర్స్, హ్యాంగ్ గ్లైడర్స్, హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగరేయటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆగస్టు 16వ తేదీ వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 


Also Read: Har Ghar Tiranga: జాతీయ జెండా పాడైతే ఎలా డిస్పోస్ చేయాలో తెలుసా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి


Also Read: Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..