Meta Layoffs: 



వేలాది మంది తొలగింపు..


10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని మార్చిలో ప్రకటించింది మెటా. అప్పటి నుంచి విడతల వారీగా లేఆఫ్‌లు కొనసాగిస్తోంది. ఇప్పటికే రెండు విడతలు పూర్తికాగా...ఇప్పుడు మూడో రౌండ్ మొదలు పెట్టింది. ఇదే చివరిది అని వెల్లడించింది. ముఖ్యంగా బిజినెస్ అండ్ ఆపరేషన్స్ విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, కంటెంట్ స్ట్రాటెజీ...ఇలా రకరకాల డిపార్ట్‌మెంట్‌లకు చెందిన ఉద్యోగులను ఇంటికి పంపింది. ఉద్యోగాలు కోల్పోయిన ఎంప్లాయిస్ లింక్డిన్‌లో వరుస పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రైవసీ అండ్ ఇంటెగ్రిటీ విభాగానికి చెందిన ఉద్యోగులకూ లేఆఫ్‌లు తప్పవని తేల్చి చెప్పింది మెటా. లింక్డిన్‌ పోస్ట్‌లు చూస్తుంటే ఇదే అర్థమవుతోంది కూడా. గతేడాది భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్ మెటాదే. 11 వేల మందిని తొలగిస్తామని గతేడాది ప్రకటించింది. ఆ తరవాత ఈ ఏడాది మార్చిలో మరో 10 వేల మంది ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. 


ఇండియన్ ఎగ్జిక్యూటివ్స్‌కి గుడ్‌బై 


2020 నుంచి వర్క్‌ఫోర్స్‌ని రెట్టింపు చేసుకున్న మెటా...ఆ మేరకు ఇప్పుడు కోతలు పెడుతోంది. మార్కెట్‌లో కంపెనీ షేర్స్‌ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాయి. ఇదంతా కాస్ట్ కట్టింగ్ వల్ల వచ్చిన ఫలితమే అని జుకర్ బర్గ్ వాదిస్తున్నారు. అయితే...మే నెలలో లేఆఫ్‌లు ఉంటాయని గతంలోనే జుకర్ ప్రకటించారు. ఆ తరవాత కూడా కోతలు కొనసాగుతాయని చెప్పిన ఆయన...ఎంత మందిని తొలగిస్తారో క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే..ఎగ్జిక్యూటివ్ స్థాయి వ్యక్తుల్నీ మెటా తొలగించింది. పైగా...ఆ ఎగ్జిక్యూటివ్స్ భారత్‌కు చెందిన వాళ్లే. ఇండియా మార్కెట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అవినాశ్ పంత్‌తో పాటు డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ మీడియా పార్టనర్‌షిప్స్ సాకేత్ ఝా సౌరభ్‌ను తొలగించింది సంస్థ. దీనిపై ఇప్పటి వరకూ ఇద్దరూ స్పందించలేదు. ఈ రౌండ్‌లో దాదాపు 490 మందిని ఒకేసారి తొలగించనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 4 వేల మందిని ఇంటికి పంపింది. నాన్ ఇంజనీరింగ్ రోల్స్‌పైనే ఎక్కువగా ప్రభావం పడుతోంది. 


టార్గెట్..


గతేడాది నవంబర్‌లో 11 వేల మందిని, ఈ ఏడాది మార్చిలో 10 వేల మందిని తొలగించింది మెటా..ఈ సారి 6 వేల మందిని తీసేయడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో 4 వేల మందిని తొలగించింది. బిజినెస్‌ టీమ్స్‌లోనే ఎక్కువ సంఖ్యలో లేఆఫ్‌లు ఉంటాయని నిక్ క్లెగ్‌ సంకేతాలిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో లేఆఫ్‌ల మార్గం తప్ప మరేదీ కనిపించడం లేదని చెప్పారు. లేఆఫ్‌లు కాకుండా మరేదైనా ప్రత్యామ్నాయ దారులున్నాయా అని వెతికినట్టు వెల్లడించారు నిక్ క్లెగ్. ఏం చేయాలో అర్థం కాకే...ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వివరించారు.  కంపెనీ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్..ఇదే విషయాన్ని కన్‌ఫమ్ చేశారు. ఈ మధ్యే జరిగిన ఓ మీటింగ్‌లో ఎంప్లాయిస్‌కి ఈ చావు కబురు చల్లగా చెప్పారు.


Also Read: Kidnapped Woman: 17 ఏళ్ల క్రితం కిడ్నాప్ అయింది, ఉన్నట్టుండి ఇప్పుడు ప్రత్యక్షమైంది - మిస్టరీ ఛేదించిన పోలీసులు