Hydra completed the demolition before stay : నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత విషయంలో హైడ్రా అధికారులు పక్కా వ్యూహంతో ఉన్నట్లుగా స్పష్టమయింది. కూల్చివేత ప్రారంెభించిన తర్వాత మధ్యాహ్నం లోపు నాగార్జున హైకోర్టుకు వెళ్తారని.. కూల్చివేత ఆపాలని మద్యంతర ఉత్తర్వులు తెచ్చుకునే అవకాశం ఉందని ముందస్తుగానే అంచనా వేసి.. ఖచ్చితంగా మూడు, నాలుగు గంటల్లోనే కూల్చి వేత పూర్తి చేయాలని అనుకున్నారని ఆ ప్రకారమే పూర్తి చేశారని భావిస్తున్నారు.
నాగార్జున కోర్టులో పిటిషన్ వేసే సరికి కూల్చివేత పూర్తి
హైడ్రా అధికారులు శనివారం ఉదయమే ఎన్ కన్వెన్షన్ వద్దకు చేరుకున్నారు. పెద్ద పెద్ద యంత్రాలతో కూడిన వాహనాలే కాకుండా పోలీసు ప్రొటెక్షన్ కూడా తెచ్చుకున్నారు. క్షణం ఆలస్యం చేయకుండా కూల్చివేతలు ప్రారంభించారు. విషయం బయటకు తెలిసే సరికి.. సగం కూల్చివేత పూర్తియంది. తర్వాత మూడు గంటల్లో మొత్తం నేల మట్టం అయిపోయింది. నాగార్జనకు విషయం తెలిసి ఉన్న పళంగా కోర్టును ఆశ్రయించే సరికి మొత్తం కూల్చివేత పూర్తయింది. ఆ తర్వాత పక్కన ఉన్న ఇతర కట్టడాల ను కూల్చి వేయడం ప్రారంభించారు. ఆ సమయంలో స్టే ఆర్డర్స్ వచ్చాయి. అంటే అప్పటికే నాగార్తున కన్వెన్షన్ మాత్రం పూర్తిగా కూల్చివేశారన్నమాట.
అక్రమ కట్టడాలపై హైడ్రా భిన్న వ్యూహం
అక్రమ కట్టడాల యజమానాలు చాలా కాలంగా.. న్యాయస్థానానికి వెళ్లి స్టే తెచ్చుకుని తమ భవనాలను కాపాడుకుంటున్నారు. నాగార్జున కూడా గతంలో ఇలా వచ్చిన నోటీసులపై కోర్టుకు వెళ్లారు. కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు నోటీసులు కూడా ఇవ్వలేదని అంటున్నారు. హైడ్రా ఏర్పాటు తర్వాత పూర్తి స్థాయిలో కూల్చివేతలకు.. న్యాయపరమైన అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదైనా కూల్చివేతలు చేయాలనుకుంటే.. ముందుగా అంచనా వేసుకుని ఆ భవనాని మూడు, నాలుగు గంటల్లోగా కూలగొట్టే ప్రణాళికతో బరిలోకి దిగుతున్నారు. ఉన్న పళంగా పూర్తి చేసేస్తున్నారు. దీని వల్ల గతంలోలా యజమానులు కోర్టుకు వెళ్లి స్ట్ తెచ్చుకున్నా ... ఆ లోపల పని పూర్తి చేస్తున్నారు.
హీరో నాగార్జునకు ఊరట - ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే
చెరువుల ఆక్రమణలపై ముందే హెచ్చరించిన హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రంగనాథ్ తనదైన ముద్ర వేస్తున్నారు. గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ బాధ్యునిగా ఆయన కీలకమైన మార్పులు చేశారు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గా ఎవర్నీ లెక్క చేయని విధంగా తన పవర్ చూపిస్తున్నారు. పూర్తి సాక్ష్యాలతో తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో వెంటనే స్పందిస్తున్నారు. సాధారణగా ఇలాంటి కబ్జాలన్నీ బడా బాబులవే ఉంటాయి. ఈ కారణంగా ఆయనపై వచ్చే ఒత్తిళ్ల గురించి చెప్పాల్సిన పని లేదు. అయినా వాటికి తలొగ్గకుండా తన పని తాను పూర్తి చేసస్తున్నారు.