N Convention Abolition :   నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ నేల మట్టం అయింది. హైదరాబాద్‌లోని అత్యంత లగ్జరీ కన్వెన్షన్ సెంటర్లలో ఓకటి ఎన్ కన్వెన్షన్. చెరువును కబ్జా చేసి కట్టాలని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నా ఎవరూ ఆ కన్వెన్షన్ సెంటర్ జోలికి పోలేదు. అయితే హఠాత్తుగా హైడ్రా అధికారులు రంగ ప్రవేశం చేశారు. రాత్రికి రాత్రి ఏర్పాట్లు చేసుకున్నారు. పొద్దున్నే ప్రారంభించి  మూడు గంటల్లో పని పూర్తి చేశారు. ఇంత కాలం కానిది ఇప్పుడు ఎలా సాధ్యమయిందన్నది అందరికీ వచ్చిన సందేహం. 


మంత్రి కోమటిరెడ్డి పట్టుదల - హైడ్రా కార్యచరణ             


మూడురోజుల కిందట  తెలంగాణ కేబినెట్‌లోని కీలక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కుఓ సవివరమైన ఫిర్యాదు అందింది. మాదాపూర్ లోని నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ .. తుమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి కట్టారని దానికి సంబంధించిన ఆధారాలతో పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వివిధ శాఖల నుంచి హైడ్రా అధికారులు సమాచారం తెప్పించుకున్నారు. దాదాపుగా మూడున్నర ఎకరాలు కబ్జా చేసినట్లుగా తేలడంతో   వంద శాతం చెరువును కబ్జా చేసిన కట్టడమని నిర్ణయించడంతో  కార్యాచరణ ప్రారంభించారు. మంత్రి కోమటిరెడ్డి లేఖతోనే ఈ త కూల్చివేతకు ప్రణాళికలు రెడీ చేశారు.      

         
            
రాత్రికి రాత్రి ప్లాన్ చేసింది కాదు పక్కా ఏర్పాట్లతోనే ! 


నాగార్జున వంటి సెలబ్రిటీ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం అంటే చిన్న విషయం కాదు. గత కొద్ది రోజులుగా .. ముఖ్యంగా  హైడ్రా కూల్చివేతలు ప్రారంభించిన తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఎంత చర్చ జరిగిందో.. నాగార్జున ఎన్ కన్వెషన్ పైనే అంతే చర్చ జరిగింది.  కానీ ఇంత వేగంగా స్పందించి కూల్చి వేస్తారని ఎవరూ అనుకోలేదు. చివరికి నాగార్జున కూడా అనుకోలేదు. ఒక వేళ అలా అనుకుని ఉంటే ఆయన కూడా ముందస్తుగానే కోర్టును ఆశ్రయించేవారు. జన్వాడ ఫామ్ హౌస్ తరపున అలాగే ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లారు. కూల్చి వేత నిర్ణయం తర్వాత పెద్దగా ఆలస్యం జరగకుండా..  అనుకున్న  పని అనుకున్నట్లుగా పూర్తి చేశారు.              


రేవంత్ పాత వీడియోలు వైరల్                    


సీఎం రేవంత్ రెడ్డి పాత వీడియోలు  .. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత వైరల్ అయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఈ ఎన్ కన్వెన్షన్ గురించి లేవనెత్తారు. అక్రమం అని తేల్చినా ఎందుకు కూలగొట్టడం లేదని ప్రశ్నించారు. అప్పట్లో ప్రభుత్వం రకరకాల సమాధానాలు చెప్పింది. అప్పట్నుచి పోరాడుతున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కాగానే ఎన్ కన్వెన్షన్ ను గురి పెట్టారని అనుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం.. కోమటిరెడ్డి లేఖ ద్వారా చేసిన ఫిర్యాదు తర్వాతనే హైడ్రా ఎన్ కన్వెన్షన్ పై గురి పెట్టింది. కూల్చివేత పూర్తి చేసింది.