Hyderabad Iconic Fish Building: హైదరాబాద్ ఒటర్ రింగ్ మీదుగా ఓ రౌండ్ వేసిన వారికి రాజేంద్రనగర్ దగ్గర కనిపించే ఓ భవనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఫిష్ ఆకారంలో ఉండే ఆ భవనం నిర్మాణం గురించి తరచూ సోషల్మీడియాలో హైలెట్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ భవనం ప్రపంచంలోని వింతైన కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 

 నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ రీజన ల్ ఆఫీస్ ఫిష్ బిల్డింగ్                    నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో నిర్మించాలనుకున్నప్పుడు చేప ఆకారంలోనే నిర్మించాలని డిదజైన్లు ఖరారు చేశారు.  ఆ మేరకు నిర్మాణం పూర్తి చేశారు. ఈ బిల్డింగ్‌కి స్ఫూర్తి..1992లో పూర్తి అయిన బార్సిలోనా ఫ్రాంక్‌ గెహ్రీ స్మారక ఫిష్‌ శిల్పం అని చెబుతారు.   దాన్ని చూసి ఇలా చేప ఆకారంలో బిల్డింగ్‌ని నిర్మించడం జరిగిందని అప్పటి అధికారులు మీడియాకు చెప్పారు.  మిమెటిక్‌ ఆర్కిటెక్చర్‌కు ఒక ఉదాహరణగా ఉంటుందని ఆర్కిటెక్చర్ నిపుణులు చెబుతున్నారు.            

Also Read: పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్ తరహా అల్లర్లు - రెచ్చిపోతున్న ఇమ్రాన్ సపోర్టర్లు - అధ్యక్షుడు పారిపోవాల్సిందేనా ?

చేప రూపంలో ఆకర్షణీయంగా కనిపించే భవనం                       

చేప రూపంలో ఉండే ఈ భవనం అనేక ప్రత్యేకతలను కలిగి ఉంటుంది.దీని ప్రవేశ ద్వారం రెండు మెట్లపై ఉన్న గుడారంలా నిర్మించారు. రెండు వృత్తాకరా అద్దాలు చేప కళ్లులా బ్లూ కలర్‌లో ఉంటాయి. మొత్తం భవనం స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తోకప్పేసిఉంటారు. ఈ బిల్డింగ్‌కి ఉన్న బ్లూ-పర్పుల్ స్పాట్‌లైట్‌లు రాత్రిపూట భవనాన్ని వెలుగుల్లో ఉండేలా చేస్తుంది.  చూడటానికి ఈ ఫిష్‌ బిల్డింగ్‌ ఓ'జెయింట్ ఫిష్' హైదరాబాద్‌లో ఈదుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే టూరిజం స్పాట్ గా మారింది. రాజేంద్రనగర్ వైపు వెళ్లేవారు ఫిష్ బిల్డింగ్ వద్దకు వెళ్లి ఓ ఫోటో దిగి వస్తూంటారు.                         

Also Read:  బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు

ఢిల్లీలోని లోటస్ టెంపుల్ కూడా వింతైన కట్టడమే                                 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వింతైన కట్టడాల్లో అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని బాస్కెట్ బాల్ బిల్డింగ్ ఉంటుంది. లాంగా బెర్గల్ బాస్కెట్ బాల్ బిల్డింగ్ చూసే వాళ్లను ఆశ్చర్య పరుస్తుంది. పోలాండ్‌లోని క్రూక్డ్ హౌస్, కెనడాలోని హఫ్ హౌస్, ఫ్లోరిడాలోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్,  జర్మనీలోని మ్యూనిచ్ లో ఉన్న బీఎండబ్ల్యూ టవర్ తో పాటు జపాన్‌లో ఓ బస్టాప్‌ కూడా వింతైన కట్టడాల్లో చోటు దక్కించుకుంది. అలాగే ఢిల్లీలోని లోటస్ టెంపుల్ కూడా వింతైన నిర్మాణాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.