Hyderabad Crime News ఇచ్చిన అప్పు తీర్చలేదని దంపతులను హత్య చేసిన దుర్ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పిలింనగర్ పరిధిలో జరిగిన దారుణం సంచలనంగా మారుతోంది. సత్యాకాలనీలో ఉండే ఖాద్రీ, ఫాతిమా దంపతులు హత్యకు గురై కనిపించారు.
అప్పు ఇచ్చిన వారు ముందుగా భర్త ఖాద్రీని చంపేశారు. ఆ డెడ్‌బాడీని పాతిపెట్టేశారు. తర్వాత ఆయన ఇంటికి వచ్చి భార్య ఫాతిమాను కూడా హత్య చేశారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేసు దర్యాప్తు చేసుకున్న ఫిలిం నగర్ పోలీసులు కేసును గంటల్లోనే ఛేదించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. వారు చెప్పే అంశాల ఆధారంగా మరికొందర్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
Hyderabad Crime News : అప్పు తీర్చలేదని దంపతుల హత్య- హైదరాబాద్‌లో దారుణం
ABP Desam
Updated at:
09 Dec 2023 09:22 AM (IST)
Hyderabad Crime News : అప్పు తిరిగి తీర్చలేదని హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో దంపతులను దుండగులు హత్య చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
NEXT
PREV
Published at:
09 Dec 2023 09:22 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -