రేవంత్‌ రెడ్డి సర్కారు మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులు పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించింది. 2009 నుంచి 2014 మధ్య తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు అందివ్వాలని జిల్లా అధికారులను డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. 


2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. వాటిలో ముఖ్యమైందని తెలంగాణ ఉద్యకారులపై కేసులు ఎత్తివేత ఇప్పటికే ఆరు గ్యారంటీలపై వడివడిగా అడుగులు వేస్తున్న సర్కారు ఇప్పుడు కేసుల పని పడుతోంది. 2009 నుంచి 2017 జూన్ రెండు వరకు ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేయాలని అధికారులకు ఆదేశించింది. 


రేవంత్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన డీజీపీ రవి గుప్తా జిల్లా పోలీసు యంత్రాంగంతో మాట్లాడారు. ఆయా జిల్లాల్లో ఉద్యమకారులపై ఉన్న కేసుల వివరాలు అందజేయాలని ఆదేశించారు. 


Also Read:చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ


Also Read: బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆరే - కాంగ్రెస్ సర్కార్ పై పోరాటానికి రెడీ !