Car Sales Report November 2023: కార్ల తయారీ కంపెనీలు 2023 నవంబర్ నెలకు తమ సేల్స్ నంబర్స్‌ను విడుదల చేశాయి. ఈసారి కూడా మారుతి సుజుకి అమ్మకాల పరంగా ముందంజలో ఉంది. హ్యుందాయ్ 49,000 కంటే ఎక్కువ కార్ల విక్రయాలతో రెండో స్థానాన్ని నిలుపుకుంది. ఇది కాకుండా 2023 నవంబర్‌లో హోండా, కియా ఇండియా కూడా మార్కెట్లో మంచి స్పందనను పొందాయి.


2023 నవంబర్‌లో హ్యుందాయ్ క్రెటాకు 11,814 యూనిట్లు అమ్ముడుపోయాయి. అయితే గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 13,321 యూనిట్లుగా ఉంది. అంటే 11 శాతం క్షీణత నమోదైంది. కంపెనీ గత నెలలో 11,180 యూనిట్ల వెన్యూ, 8,325 యూనిట్ల ఎక్స్‌టర్ మైక్రో SUVలను విక్రయించింది. కొత్త ఎక్స్‌టర్ దేశంలో ఇప్పటివరకు లక్షకు పైగా బుకింగ్‌లను పొందింది. ఇది కాకుండా 2023 నవంబర్‌లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 4,708 యూనిట్లు అమ్ముడుపోయింది. ఐ20కి సంబంధించి 5727 యూనిట్లు, ఆరాకు సంబంధించి 3850 యూనిట్లను విక్రయించింది. అయితే వెర్నా అమ్మకాలు 2023 నవంబర్‌లో 1701 యూనిట్లకు తగ్గాయి. ఇది గత నెలలో 2,025 యూనిట్లుగా ఉన్నాయి. గత నెలలో కంపెనీ అయోనిక్ 596 యూనిట్లను విక్రయించింది.


కియా అమ్మకాలు ఇలా...
2023 నవంబర్‌లో కియా 22,762 యూనిట్లను విక్రయించింది. అయితే గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 24,025 యూనిట్లుగా ఉంది. దీని కారణంగా వార్షిక ప్రాతిపదికన అమ్మకాల్లో ఐదు శాతం క్షీణత నమోదైంది. కంపెనీ 11,684 యూనిట్ల సెల్టోస్‌ను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 9,284 యూనిట్లుగా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 26 శాతం ఎక్కువగా ఉంది. కంపెనీ మొత్తం అమ్మకాలలో కియా కారెన్స్ 4,620 యూనిట్లు, కియా సోనెట్ 6,433 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే తగ్గుదలని నమోదు చేసింది. కంపెనీ గత నెలలో 25 యూనిట్ల ఈవీ6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విక్రయించింది.


ఇటీవల ప్రారంభించిన హోండా ఎలివేట్ ద్వారా 2023 నవంబర్‌లో హోండా వార్షిక అమ్మకాల వృద్ధి 24 శాతం సాధించింది. కంపెనీ గత నెలలో 4,755 యూనిట్ల ఎలివేట్‌లను విక్రయించింది. 2023 నవంబర్‌లో హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ 2,639 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే నెలలో 3,890 యూనిట్లు విక్రయించగా, ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు 32 శాతం క్షీణతను నమోదు చేశాయి. అలాగే హోండా సిటీ విక్రయాలు కూడా 51 శాతం క్షీణించాయి. కంపెనీ 2023 నవంబర్‌లో హోండా సిటీ 1,336 యూనిట్లను విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో 2,711 యూనిట్ల విక్రయాలు జరిగాయి.


మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మూడు ఫేమస్ ఎస్‌యూవీలను 2024లో విడుదల చేయనుంది. అవే క్రెటా, అల్కజార్, టక్సన్ అప్‌డేటెడ్ మోడల్స్ అని తెలుస్తోంది. ఈ మూడూ త్వరలో భారతీయ మార్కెట్లో లాంచ్ కానున్నాయి. జనవరి 16వ తేదీన జరగనున్న కంపెనీ ఈవెంట్‌లో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుందని సమాచారం. ఇది అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీతో కూడిన అధునాతన డిజైన్, ఫీచర్లతో కూడిన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!