హైదరాబాద్‌లోని తార్నాకలో ఓ మహిళను నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి ఆమెను చెరబట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. 


ఏడో తేదీ రాత్రి బస్టాండ్‌లో నిల్చొని ఉన్న మహిళను టార్గెట్ చేశాడు ఏసు అనే వ్యక్తి. ఆమెకు మాయ మాటలు చెప్పాడు. ఆమెతో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యాడు. లాలాగూడ వెళ్లాలని తెలుసుకున్నాడు. అక్కడికే తనూ వెళ్తున్నానని చెప్పుకొచ్చాడు. దించేసి అటుగా వెళ్లిపోతానని చెప్పుకొచ్చాడు. బైక్ ఎక్కిన తర్వాత తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. 


ఆమెను దించాల్సిన చోటికి కాకుండా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడకు చేరుకున్న స్నేహితులతో ఆమెపై అత్యాచారం చేశారు. ఆమెను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం సీసీ ఫుటేజ్‌  ఆధారంగా విచారణ చేపట్టారు. నలుగురు నిందితులైన మధు. ప్రశాంత్‌, రోహిత్‌ను అరెస్టు చేశారు. 32 ఏళ్ల ఏసు అనే వ్యక్తి స్థానికంగా మెకానిగ్‌గా పని చేస్తున్నాడు. అతని స్నేహితులు మధు వయసు 31 ఏళ్లు, ప్రశాంత్‌కి 20 ఏళ్లు, రోహిత్‌ 19 ఏళ్లు.