Saggubiyyam Vadalu Making Process : శీతాకాలంలో ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే బ్రేక్​ఫాస్ట్​గా ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తుంది. రోటీన్​కి భిన్నంగా.. కాస్త క్రంచీగా, టేస్టీగా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు సగ్గుబియ్యంతో వడలు తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే ఉండే పదార్థాలతో.. తక్కువ టైమ్​లో వేడి వేడి సగ్గుబియ్యం వడలు చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కువ కష్టపడాలేమో అనుకుంటున్నారేమో.. అస్సలు ఎక్కువ టైమ్ అవసరం లేదు. రెసిపీ చాలా సింపుల్. మరి ఈ టేస్టీ రెసిపీని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


సగ్గుబియ్యం - 250 గ్రాములు


బంగాళా దుంపలు - 100 గ్రాములు (ఉడికించి పొట్టు తీసుకోవాలి)


పల్లీలు - 50 గ్రాములు (వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి)


అల్లం - 10 గ్రాములు (సన్నగా తురుముకోవాలి) 


పచ్చిమిర్చి - 10 గ్రాములు (సన్నగా తురుముకోవాలి) 


కొత్తిమీర - 1 కట్ట (సన్నగా తురుముకోవాలి) 


జీలకర్ర పొడి - 5 గ్రాములు


ఉప్పు - తగినంత


మిరియాల పొడి - కొంచెం


నెయ్యి లేదా నూనె - 50 మిల్లీ లీటర్


తయారీ విధానం


మీరు ఈ రెసిపీని ప్రిపేర్​ చేయాలనుకున్నప్పుడు.. వంట స్టార్ట్ చేయడానికి ఓ అరగంట ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుని.. నానబెట్టిన సగ్గుబియ్యం నుంచి నీరు వేరు చేయాలి. సగ్గుబియ్యాని పిండి గిన్నెలో వేయాలి. దానిలో ఉడికించిన బంగాళ దుంపలు, పల్లీలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఈ పదార్థాలన్నీ బాగా కలిసేలా చేతితో కలపండి. 


ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడలులాగా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి. స్టౌవ్ వెలిగించి దానిపై అట్లకాడ ఉంచండి. మీడియం మంట మీద ఉంచి.. దానిపై నెయ్యి లేదా నూనె వేయండి. అది వేడెక్కిన తర్వాత వడలుగా చేసుకున్న సగ్గుబియ్యం కట్​లేట్స్​ను ప్లేస్ చేయాలి. ఒకవైపు రోస్ట్​ అయిన తర్వాత మరోవైపు రోస్ట్ చేయాలి. అది రెండువైపులా బంగారు రంగులో.. క్రిస్పీగా రోస్ట్ చేయాలి. దీనిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవాలి. 


దీనిని ఉదయం బ్రేక్​ ఫాస్ట్​గా లేదంటే సాయంత్రం స్నాక్​గా కూడా తీసుకోవచ్చు. పైగా దీనిని వేడి వేడి ఛాయ్​కి మంచి కాంబినేషన్. ఇది పిల్లలకు ఎంతో బాగా నచ్చుతుంది. కాబట్టి మీరు వారికి స్నాక్స్​ బాక్స్​లో దీనిని పెట్టొచ్చు. క్రంచీగా ఉండే ఫుడ్స్​ అంటే పిల్లలు కచ్చితంగా ఇష్టపడతారు. కాబట్టి వారికి బ్రేక్​ఫాస్ట్​గా కూడా ఇవి మంచి ఛాయిస్ అవుతాయి. అంతేకాకుండా దీనిలో అల్లం, మిరియాలు వంటి పదార్థాలు ఆరోగ్యానికి మంచివి. పిల్లలతో పాటు పెద్దలు కూడా వీటిని హాయిగా లాగించేయవచ్చు. 


Also Read : ఇన్​స్టాంట్ ఇడ్లీ రెసిపీ.. మరమరాల(బొరుగులు)తో ఈజీగా చేసేయొచ్చు










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.