Hyderabad court orders Swiggy to pay Rs 35 000 for charging Rs 103 delivery fee: వినియోగదారుడిని మోసం చేసినందుకు 35 వేల రూపాయల పరిహారం..ఆయన ఆర్డర్ ఇచ్చిన రూ. 350 బిల్లు కూడా వెనక్కి ఇచ్చేయాలని రంగారెడ్డి జిల్లాలోని వినియోగదారుల న్యాయస్థానం స్విగ్గీని ఆదేశించింది. స్విగ్గికి ఫైన్ వేసిన వ్యవహారం విచిత్రమైనది కాదు. స్విగ్గి ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఓ సారి ఎదురయ్యే ఉంటుంది. కానీ ఎందుకు వదిలి పెట్టాలనుకున్న బాబు అనే వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 


ఫ్రీ డెలివరీ పెట్టకూడదని కోర్టుకు


హైదరాబాద్‌కు చెందిన బాబు అనే వ్యక్తి స్విగ్గి యాప్‌లో స్విగ్గి  వన్ అనే స్కీమ్ ను ఎంచుకున్నాడు. ఈ స్కీమ్ ప్రకారం ఆయనకు ఫ్రీ డెలివరీ చేయాల్సి ఉంది. పధ్నాలుగు కిలోమీటర్ల లోపు రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ ఇస్తే ఫ్రీ డెలివరీ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఫ్రీ డెలివరీ ఉంది కదా అని బాబు అనే వ్యక్తి ఓ మంచి రెస్టారెంట్ నుంచి తనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. దానికి రూ.350  ఖర్చు అయింది. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత చూస్తే.. రూ. 103 రూపాయలు డెలివరీ ఫీజు ఉంది. ఇదేదో పెద్ద మోసమనుకున్న ఆయన దీన్ని ఇలా వదిలి పెట్టకూడదని కోర్టుకు వెళ్లారు.   


Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లలలో బెంగాలీ భాష - ఎందుకో తెలుసా ?


స్విగ్గి మోసం చేసిన వైనాన్ని ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచారు. కోర్టు కేసు నమోదు చేసుకుని విచారణకు రావాలని స్విగ్గికి ఆదేశాలు జారీ చేసింది. కానీ స్విగ్గి (Swiggy) నుంచి ఎవరూ రాలేదు. ఇలా రెండు, మూడు వాయిదాలు చూసిన తర్వాత న్యాయమూర్తి తప్పు చేసినందునే వాదనలు వినిపించడానికి రావడం లేదని నిర్దారించి రూ.35వేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్డర్ ఇచ్చిన డబ్బులు కూడా రిఫండ్ చేయాలని ఆదేశించింది. స్విగ్గి వన్ మెంబర్ షిప్ తీసుకున్న వారిలో చాలా మందికి ఇదే తరహా అనుభవం ఎదురయి ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇప్పుడు ఇలాంటి వాటికి న్యాయస్తానాలకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న అభిప్రాయానికి వస్తున్నారు.   


Also Read: : పాకిస్తాన్‌లో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్న సినీ నటి - ఇక అక్కడి వాళ్లు వదులుతారా ?


నిజానికి ఆన్ లైన్ షాపింగ్ సైట్స్, ఫుడ్ డెలివరి యాప్‌లు ఇతర  యాప్స్‌లో చిన్న చిన్న మోసాలు జరుగుతూ ఉంటాయి. వినియోగదారులు నష్టపోతూంటారు. అయితే చిన్న మొత్తమే కదా అని వదిలేస్తూ ఉంటారు. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా పెద్దగా స్పందన ఉండదు. వినియోగదారుల కోర్టు వరకూ వెళ్లడం ఎందుకు ఆ యాప్ ఉయోగించడం మానేస్తే పోతుంది కదా అనుకుంటారు. కానీ అదో నిరంతర సైకిల్ గా మారిపోతోంది. దీన్ని బాబు అనే వ్యక్తి చేధించాడు. ఇక ఇలా మోసపోయిన వారంతా కోర్టులకు వెళ్లి పరిహారం పొందవచ్చు.