26 Year Old Killed By Nephew Over Less Contribution For Alcohol In Jabalpur: వాళ్లిద్దరూ మేనమామ, మేనల్లుడు. ఇద్దరూ కల్సి పార్టీ చేసుకోవాలనుకున్నారు. ఎవరి మద్యం వారు కాకుండా కలిసి పార్టీ చేసుకుందామనుకన్నారు. తన వద్ద ఎక్కువ డబ్బులు లేవని చాలా కొద్ది మొత్తమే ఇచ్చాడు మేనమామ. ఎంతో కొంత ఇచ్చాడులే అని మేనల్లుడు మిగతా మొత్తం తాను వేసుకుని ఓ ఫుల్ బాటిల్ స్టఫ్ తీసుకు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఓ కొండపైకి వెళ్లి కూర్చుని తాగడం ప్రారంభించారు. అయితే మద్యం తేవడానికి చాలా కొద్ది మొత్తమే ఇచ్చిన మామ తాగుడు ప్రారంభించిన తర్వాత ఎక్కువ తాగేస్తున్నడాని కోపం వచ్చింది. అంతే రాయి తీసుకుని తల బద్దలు కొట్టి హత్య చేసేశాడు. తర్వాత మిగిలింది మొత్తం తన దోవన తాను పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో జరిగింది.
జబల్పూర్‌కు చెందిన మనోజ్ ఠాకూర్‌కు పందొమ్మిదేళ్లు, చదువు మానేసి చాలా కాలం అయింది. మద్యానికి అలవాటు పడ్డాడు. ఆ పనీ ఈ పనీ చేసుకంటూ టైం పాస్ చేస్తూంటాడు. అతని మేనమామ పేరు ధరమ్ ఠాకూర్. వయసు ఇరవై ఆరేళ్ల్లు. అతను కూడా కుదిరినప్పుడు ఏదో ఓ పనికి వెళ్లి మిగిలిన సమయంలో మద్యం తాగుతూ టైంపాస్ చేస్తూంటాడు. ఒక రోజు ఇద్దరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. 60 రూపాయలతో చికెన్ స్టఫ్ , 340తో మద్యం బాటిల్ కొనుక్కున్నారు. దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి తాగడం ప్రారంభించారు.
బ్యాగుల్లో చాక్లెట్, స్వీట్ ప్యాకెట్స్ - అనుమానంతో తనిఖీ చేసిన పోలీసులకు షాక్
మామ ధరమ్ ఠాకూర్ వేగంగా తాగేస్తూ..స్టఫ్‌ను కూడా తినేస్తూ ఉండటంతో ఒకటికి రెండు సార్లు మెల్లగా తాగాని మనోజ్ ఠాకూర్ హెచ్చరించాడు. అయితే ధరమ్ మాత్రం అదేమీ పట్టించుకోలేదు. బాటిల్ మొత్తం తాగేలా గడగడ రౌండ్లు ఫినిష్ చేస్తున్నాడు. ఇది మనోజ్ ఠాకూర్ కు ఆగ్రహం తెప్పించింది. చెప్పినా వినడం లేదని రాళ్లు, కర్రతో దాడి చేశాడు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో ధరమ్ ఠాకూర్ అక్కడిక్కడే చనిపోయాడు. తర్వాత మిగిలిన మద్యం తాగా ఇక్కడ్నుంచి వెళ్లిపోయాడు మనోజ్ ఠాకూర్.
‘డెలివరీ కోసం వెళితే ప్రాణం తీశారు’ - హాస్పిటల్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన
ఉదయమే ఒకరు శవాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చంపింది మేనల్లుడేనని సులువుగా అర్థమైపోవడంతో పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఇరు కుటుంబాల మధ్య చిన్న చిన్న గొడవలు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అయితే చంపుకునేంత కోపం మాత్రం.. మద్యం తాగే దగ్గరే వచ్చిందని అంటున్నారు. మొత్తంగా కంబైన్డ్ పార్టీలకు వెళ్లేటప్పుడు.. మరితం జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన నిరూపిస్తోంది.