Hotel Prora Germany: 


విలాసవంతమైన హోటల్...


ఏదైనా కొత్త చోటుకు వెళ్లినప్పుడు మనం మొట్ట మొదట వెతికేది హోటళ్లే. మన బడ్జెట్‌లో ఏది బాగుంటుందో గూగుల్‌లో సెర్చ్ చేసి రివ్యూస్ చూసి అక్కడికి వెళ్లిపోతాం. కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అయ్యేందుకు హోటళ్ల యాజమాన్యాలూ ఆఫర్‌లు ఇస్తుంటాయి. ప్రత్యేక ఏర్పాట్లూ చేస్తాయి. టూరిస్ట్ ప్లేసెస్‌లో అయితే హోటళ్లు ఖాళీగానే ఉండవు. బుకింగ్స్ అవుతూనే ఉంటాయి. కానీ...ఇప్పుడు మనం చెప్పుకోబోయే హోటల్‌లో ఇప్పటి వరకూ ఒక బుకింగ్‌ కూడా అవ్వలేదు. అలా అని అదేదో చిన్న హోటల్‌ కాదు. పదివేల గదులున్న విలాసవంతమైన హోటల్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ...ఒక్కరు కూడా అందులోకి అడుగు పెట్టలేదు. అసలు ఈ హోటల్ ఎక్కడుంది..? ఎందుకు టూరిస్ట్‌లు అక్కడికి వెళ్లడం లేదు..? దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి..?


10 వేల గదులు..


జర్మనీలోని బాల్టిక్ సముద్ర తీరంలో రుగెన్ ద్వీపంలో ఉంది ఈ హోటల్. 80 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ హోటల్‌ వైపు ఇప్పటి వరకూ ఎవరూ కన్నెత్తైనా చూడలేదు. ఇందులో 10 వేల గదులున్నాయి. 1936-39 మధ్య కాలంలో ఈ హోటల్‌ను నిర్మించారు. అప్పటికి జర్మనీని హిట్లర్ పరిపాలిస్తున్నాడు. అప్పటి నాజీ ఆర్మీ ఈ హోటల్‌ను దగ్గరుండి మరీ కట్టించింది. దాదాపు 9 వేల మంది కార్మికులు కలిస్తే కానీ ఇంత పెద్ద హోటల్ నిర్మాణం పూర్తవలేదు. ఇంతకీ ఈ హోటల్ పేరు చెప్పలేదు కదూ. దీన్ని హోటల్ డ ప్రొర (Prora Hotel) అని పిలుస్తారు. ఈ పేరు పెట్టడం వెనక కూడా ఓ హిస్టరీ ఉంది. ఈ ఏరియాలో మొక్కలు గుబురుగా పెరుగుతాయి. ఎక్కడ చూసినా పొదలే కనిపిస్తాయి. Prora అంటే జర్మన్ భాషలో పొదలు అని అర్థం. అందుకే ఈ హోటల్‌కు Prora Hotel అని పేరు పెట్టారు. 


సినిమా హాల్‌, స్విమ్మింగ్ పూల్..


సముద్ర తీరానికి 150 మీటర్ల దూరంలో నిర్మించారు. మొత్తం ఈ హోటల్‌లో 8 బ్లాక్‌లు ఉంటాయి. 4.5 కిలోమీటర్ల పొడవున ఈ హోటల్‌ విస్తరించి ఉంది. ఇందులో సినిమా  హాల్, ఫెస్టివల్ హాల్‌తో పాటు స్విమ్మింగ్ పూల్‌ కూడా ఉంది. అంతే కాదు. ఓ క్రూజ్ షిప్‌ పట్టేంత స్పేస్ ఉంటుంది. ఈ హోటల్ నిర్మాణం తుది దశకు వచ్చే నాటికి అంటే 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలయ్యాక ఈ నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కార్మికులందరూ హిట్లర్ వార్ ఫ్యాక్టరీల్లో పని చేయాల్సి వచ్చింది. 1945లో యుద్ధం ముగిసి నప్పటికీ...మళ్లీ ఎవరూ ఈ హోటల్‌ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు పూర్తిగా ఐసోలేటెడ్‌ అయిపోయింది. ఒకవేళ ఈ హోటల్‌ను తెరిచి బుకింగ్స్ ఓపెన్ అయితే...ప్రపంచంలోనే ది బెస్ట్‌గా నిలవడం ఖాయం. కానీ...ప్రభుత్వం కూడా దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు కొందరు ఆ హోటల్ పరిసరాల్లోకి వెళ్లి ఊరికే అక్కడ నిలబడి ఫోటోలు దిగుతుంటారంతే. 


Also Read: Go Ahead Fire Me: ఉద్యోగం పోతే పోయింది కానీ చాలా హ్యాపీగా ఉంది, నచ్చిన పని చేసుకుంటాం - నయా ట్రెండ్