Go Ahead Fire Me:


భారీ లేఆఫ్‌లు..


ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌ల ట్రెండ్ నడుస్తోంది. అన్ని కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. నా టర్న్ ఎప్పుడో అని ఉద్యోగులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. 1969 తరవాత  ఈ స్థాయిలో లేఆఫ్‌లు చేయడం మళ్లీ ఇప్పుడే. నిరుద్యోగ రేటు కూడా పెరుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. అయితే...ఉద్యోగులందరూ జాబ్ పోతుందని టెన్షన్ పడటం లేదు. పైగా కొందరు రిలాక్స్ అవుతున్నారట. అదేంటి ఉద్యోగం ఊడితే హ్యాపీగా ఉంటారా..? అని అనుమానం రావచ్చు. కానీ...కొన్ని రిపోర్ట్‌లు కొత్త విషయం చెప్పాయి. "ఉద్యోగంలో నుంచి తీసేయడమే మాకు చాలా ప్రశాంతంగా ఉంది" అని చెబుతున్నారట కొందరు ఉద్యోగులు. కేవలం జీతం కోసం నచ్చినా నచ్చకపోయినా ఉద్యోగాలు చేసే వాళ్లంతా ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారట. అంతే కాదు. తమకు నచ్చిన పనులు చేసుకునేందుకు టైమ్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 


రిలాక్స్ అవుతున్నాం: ఉద్యోగులు


"నచ్చిన పనులు చేసుకుంటూ హ్యాపీగా గడపాలని న్యూ ఇయర్ మొదలు కాగానే నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఉద్యోగం పోయింది. ఇప్పుడు నాకిష్టమైన పనులు చేసుకోడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు" అని తేల్చి చెబుతున్నారు కొందరు ఉద్యోగులు. "ఇలా జాబ్ పోవడం కంఫర్ట్‌గానే ఉంది. ఎమర్జెన్సీ ఫండ్‌ కూడా పెట్టుకున్నాం. ఎప్పుడిలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు కదా" అని ఇంకొందరు చెబుతున్నారు. ఇక కొందరు ఎంప్లాయిస్ అయితే...లేఆఫ్‌ అవగానే వెంటనే జాబ్ సెర్చ్ మొదలు పెట్టి వారం గ్యాప్‌లోనే మరో ఉద్యోగం వెతుక్కుంటున్నారు. అందుకే జాబ్ తీసేసినా "ఇదేమంత పెద్ద కష్టం కాదు" అని లైట్‌ తీసుకుంటున్నారు. కొందరైతే ఈ లేఆఫ్‌ల వల్ల లైఫ్‌ని కొత్త యాంగిల్‌లో చూసే అవకాశం దక్కిందని చాలా ఫిలాసఫికల్‌గా చెప్పేస్తున్నారు. మార్కెట్‌ ఎలా ఉంది..? కొత్త టెక్నాలజీలు ఏం వచ్చాయి..? అని తెలుసుకునేందుకు బోలెడంత టైమ్ దొరుకుతుందని అంటున్నారు. ఇంకొందరైతే "నాకిప్పుడే ఫ్రీడమ్ వచ్చినట్టుంది" అని నవ్వుతూ చెబుతున్నారు. 


ప్రపంచవ్యాప్తంగా టెక్‌ కంపెనీలన్నీ లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటాతో మొదలైన ఈ ట్రెండ్...అన్ని కంపెనీలకు విస్తరించింది. ఇప్పుడు మరోసారి మెటా కంపెనీ లేఆఫ్‌లు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. Financial Times రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా పలు టీమ్‌లకు అవసరమైన బడ్జెట్‌ను రిలీజ్ చేయలేదు. అంటే...ఇన్‌డైరెక్ట్‌గా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నట్టు సంకేతాలిచ్చింది. ఉద్యోగులను తొలగించిన తరవాతే బడ్డెట్‌లు విడుదల చేయాలని భావిస్తోంది యాజమాన్యం. ఇప్పటికే ఉద్యోగుల్లో లేఆఫ్‌ల భయం మొదలైంది. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ ఇస్తారో అని కంగారు పడిపోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఒకేసారి 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం సంచలనమైంది.


Also Read: Aero India 2023: నవ భారత శక్తికి ఇది నిదర్శనం, గత రికార్డులు బ్రేక్ చేశాం - ఏరో ఇండియా షోలో ప్రధాని మోదీ