Harsh Mahajan Joins BJP: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్ మహాజన్.. భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న మహాజన్ ఎన్నికల వేళ పార్టీ మారడం చర్చనీయాంశమైంది. పార్టీ మారిన తర్వాత మహాజన్.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన భాజపాలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత హర్ష్ మహాజన్.. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమయ్యారు. హర్ష్ మహాజన్ గతంలో మంత్రిగా పనిచేశారు. మాజీ సీఎం వీరభద్రసింగ్‌కు ఆయన ప్రధాన అనుచరుడు.
వరుసగా
భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ.. ఓ వైపు కాంగ్రెస్ కార్యకర్తల్లో పునరుత్తేజం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పార్టీకి దూరమవుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ పెట్టుకున్నారు.
గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. మరోపక్క రాజస్థాన్‌లోనూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య కుమ్ములాటలు పార్టీని మరింత బలహీన పరుస్తున్నాయని కార్యకర్తలు అంటున్నారు.
త్వరలో
హిమాచల్ ప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భాజపా ఎన్నికలకు సిద్ధమవుతుండగా కాంగ్రెస్‌లో కీలక నేతలు పార్టీకి బైబై చెబుతున్నారు.
జోడో యాత్ర
మొత్తం 3,570 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.
కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ముకశ్మీర్‌లో ముగుస్తుంది. ప్రస్తుతం జోడో యాత్ర కేరళకు చేరుకుంది. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయరు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉంటాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్‌లో ఉంటారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేయనున్నారు.
Also Read: Bihar Politics: తేజస్వీ యాదవ్‌ను బిహార్ సీఎం చేసిన నితీశ్ కుమార్!
Also Read: Dailyhunt - AMG Media: ముగిసిన 'స్టోరీ ఫర్ గ్లోరీ' టాలెంట్ హంట్- విజేతలుగా నిలిచిన 12 మంది