Bihar Politics: 'బిహార్ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్'.. అదేంటి బిహార్‌కు సీఎం నితీశ్ కుమార్ కదా! అనుకుంటున్నారా? అవును బిహార్‌కు నితీశ్ కుమారే ముఖ్యమంత్రి. అయితే నితీశ్ కుమార్.. స్వయంగా "బిహార్ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్" అని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
టంగ్ స్లిప్
నితీశ్ కుమార్ పప్పులో కాలేశారు. తన డిప్యూటీ తేజస్వీ యాదవ్ గురించి ప్రస్తావిస్తూ పొరపడ్డారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అనేశారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ తప్పును సీఎం సరి చేయలేదు. అలాగే ప్రసంగాన్ని కొనసాగించారు.
మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో నితీశ్ ఇలా అన్నారు. "గౌరవనీయ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్" అనేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
భాజపా విమర్శలు
ఈ వీడియో బయటకు రాగానే ప్రతిపక్ష భాజపా.. నితీశ్ కుమార్‌పై విమర్శనాస్త్రాలు సంధించింది.
జేడీయూ కౌంటర్
భాజపా విమర్శలపై జేడీయూ కౌంటర్ ఇచ్చింది. పొరపాటున నోరు జారిన వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదని చెప్పుకొచ్చింది.
ఇటీవల భాజపాతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ మళ్లీ లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీతో చేరి బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. బిహార్ తర్వాత నితీశ్ కుమార్ ఇప్పుడు భాజపాను కేంద్రం నుంచి గద్దె దించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన సన్నాహాలు కూడా మొదలుపెట్టారు.
ఇటీవల నితీశ్.. దిల్లీలో పర్యటించి మొత్తం విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. "మేం ఏర్పాటు చేసేది థర్డ్ ఫ్రంట్ కాదు మెయిన్ ఫ్రంట్" అంటూ నితీశ్ చెబుతున్నారు. ప్రధాని పదవి రేసులో ప్రతిపక్షాల నుంచి నితీశ్ పేరే ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలను ఆయన తోసిపుచ్చారు. అయితే జేడీయూ, దాని మిత్రపక్షాలు మాత్రం నితీశ్‌ను ప్రధాని పదవి రేసులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Also Read: Dailyhunt - AMG Media: ముగిసిన 'స్టోరీ ఫర్ గ్లోరీ' టాలెంట్ హంట్- విజేతలుగా నిలిచిన 12 మంది
Also Read: Ankita Bhandari Murder Case: అంకిత కుటుంబానికి భారీ ఆర్థిక సాయం- ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో కేసు విచారణ