ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) లో సంగీత దర్శకుడు మాత్రమే కాదు... ఓ నటుడు, ఓ దర్శకుడు కూడా ఉన్నారు. తాను ప్రధాన పాత్రలో నటించడంతో పాటు 'తులసి దళం', 'బ్రోకర్' సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఇంకొన్ని సినిమాలు తీశారు. కొంత విరామం తర్వాత ఆర్పీ పట్నాయక్ మెగాఫోన్ పట్టుకున్న సినిమా 'కాఫీ విత్ ఎ కిల్లర్' (Coffee With A Killer Movie).


ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'కాఫీ విత్ ఎ కిల్లర్' ట్రైలర్ విడుదల అయ్యింది. అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ ''కరోనా తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. 'కాఫీ విత్ ఎ కిల్లర్' ట్రైలర్‌లో కంటెంట్ కనపడుతోంది. ఈ ట్రైలర్ చూస్తే... ఎంటర్‌టైనింగ్‌గా ఉంది.  కాఫీ షాప్‌లో ఇన్ని జరుగుతుంటాయి కాబోలు అనిపిస్తోంది. ట్రైలర్ చూశాక... ఈ చిత్రానికి ఆర్పీ గారే హీరో అనిపించింది. ఏ సినిమాకు అయినా కథే హీరో. ఆ కథను మలిచింది ఆయనే కనుక... 'కాఫీ విత్ కిల్లర్'కు ఆయనే హీరో. నాకు ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం. టీనేజ్ అంతా ఆయన పాటలు వింటూ పెరిగా. ఈ చిత్రానికి పని చేసిన చాలా మందితో కెరీర్ మొదటి నుంచి ప్రయాణిస్తున్నాను. అందుకని, నా స్నేహితుల మధ్య ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుతున్నాను'' అని చెప్పారు.  


'కాఫీ విత్ ఎ కిల్లర్' ట్రైలర్ విషయానికి వస్తే... ఒక కాఫీ షాప్‌లో కిల్లర్ ఉంటాడు. అతడిని చూసి కమెడియన్ అనుకుంటారు ఓ బ్యాచ్. ఆ షాప్‌కు ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. సెటిల్మెంట్ బ్యాచ్, జాతకాలు నమ్మే యువకుడు, అమ్మాయి ప్రేమ గురించి మాట్లాడే కుటుంబం... రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరి మధ్య ఏం జరిగిందనేది కథగా తెలుస్తోంది.


''తొలుత ఈ 'కాఫీ విత్ ఎ కిల్లర్' టైటిల్ విని 'కాఫీ విత్ కరణ్'లాగా ఉందేంటి? అనుకున్నా. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే... చూస్తే చాలా థ్రిల్లింగ్‌గా, ఎంటర్టైనింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది'' అని ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ''డిఫరెంట్ అండ్ కొత్త కాన్సెప్ట్ కథ రాసుకుని 'కాఫీ విత్ ఎ కిల్లర్' సినిమా తీశా. ఓటీటీలకు జనాలు అలవాటు పడుతుండటంతో, వాళ్ళను థియేటర్స్‌కు తీసుకు రావాలంటే... కొత్తదనం కావాలని ఎంటర్‌టైనింగ్‌తో కూడిన థ్రిల్లర్‌గా సినిమా తీశాం. 'సెవెన్‌హిల్స్' సతీష్ నాకు తోడై నిర్మాతగా వ్యవహరించాడు. మా కాంబినేషన్‌లో మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాలో ఓ సీక్రెట్ ఉంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దాన్ని రివీల్ చేస్తాం'' అని ఆర్పీ పట్నాయక్ అన్నారు.


Also Read : నాతో పెట్టుకుంటే ఊరుకోను, నాకు ఎవరు సాటి లేరు - వచ్చిండు చూడు మన 'జిన్నా' భాయ్
  
'కాఫీ విత్ ఎ కిల్లర్' సినిమాలో శ్రీనివాసరెడ్డి, రవిబాబు, 'సత్యం' రాజేష్, రఘుబాబు, 'జెమినీ' సురేష్, రవిప్రకాష్, 'టెంపర్' వంశీ, బెనర్జీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ది బెస్ట్ క్రియేషన్, సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై 'సెవెన్‌హిల్స్' సతీష్ నిర్మించారు. 'బట్టల రామస్వామి బయోపిక్కు' తర్వాత ఆయన నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రానికి క్రియేటివ్ హెడ్ : గౌతమ్ పట్నాయక్, ఛాయాగ్రహణం - కూర్పు - డీఐ : అనుష్ గౌరక్, మాటలు : డైలాగ్స్: తిరుమల నాగ్, నిర్మాత: 'సెవెన్ హిల్స్' సతీష్, రచన - దర్శకత్వం : ఆర్ పి పట్నాయక్.


Also Read : మహేష్ బాబును ఓదార్చిన కేటీఆర్, ధైర్యం చెప్పిన త్రివిక్రమ్ - ఇందిరా దేవికి ప్రముఖులు నివాళులు