Highest-paid Bodyguards Of Bollywood Stars : బాలీవుడ్ స్టార్లకేం కోట్లకు కోట్లు పడిపోతూంటాయనుకుంటారు. కానీ వారికి ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఇతర వ్యాపారాల్లో సంపాదించుకోకపోతే బాడీగార్డులకు కూడా జీతాలివ్వడం కష్టం. ఎందుకంటే బాడీగార్డుకు వారు కోట్లు ఖర్చు పెడతారు. బాలీవుడ్ సూపర్ స్టార్లలో కొంత మంది తమకు ఇష్టమైన బాడీగార్డులను నియమించుకుంటారు. బౌన్సర్లను కాకుండా తమను అంటి పెట్టుకుని ఉండేలా రూ. కోట్లు జీతం ఇచ్చి పెట్టుకుంటారు. బాలీవుడ్ స్టార్ల దగ్గర ఉండే బాడీగార్డులకు కోట్ల జీతం వస్తుంది.
షారుఖ్ బాడీగార్డుకు అత్యధిక వేతనం
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ అత్యంత కాస్ట్ లీ. రవి సింగ్ అనేభలీ ఆ బాడీగార్డు ఎప్పుడూ షారుఖ్ పక్కనే కనిపిస్తూ ఉంటారు. ఆయనకు ఏడాదికి రెండున్నరకోట్ల జీతం ఇస్తున్నారు షారుఖ్ ఖాన్. ఇంత భారీగా జీతం తీసుకునే మరో బాడీగార్డ్ ఇండియాలో లేరు. ఇక రెండో స్థానంలో సన్మాన్ ఖాన్ బాడీగార్డ్ షెరా ఉంటారు. రవిసింగ్ కు జీతం ఎక్కువ వస్తుంది కానీ.. షెరానే బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ బాీగార్డు. ాయనకు సల్మాన్ రెండు కోట్ల వరకూ చెల్లిస్తున్నారు. నిజానికి ఇండియాకు ఏ సెలబ్రిటీ వచ్చినా బాలీవుడ్ నుంచి షెరాను బాడీగార్డుగా పంపిస్తూంటారు. సల్మాన్ ను అంటి పెట్టుకుని ఉండే షెరా.. అభిమానులు దూసుకు రాకుండా గోడలాగా నిలబడతాడు. పదిహేనేళ్ల నుంచి సల్మాన్ వద్దనే పని చేస్తున్నాడు. షెరా అంటే సల్మాన్ కు చాలా అభిమానం. ఆయనపై ఉన్న అభిమానంతో బాడీగార్డ్ అనే సినిమాలో కూడా నటించాడు.
తమిళనాడు రాజకీయాల్లో క్రీమ్ బన్ పాలిటిక్స్ - నిర్మలా సీతారామన్ పై విమర్శలు
వ్యక్తిగత పనుల్లోనూ వెంటే ఉండే బాడీగార్డులు
అమీర్ ఖాన్ వ్యక్తిగత బాడీగార్డ్ పేరు యువరాజ్ గోర్పడే.ఆయన జీతం రెండు కోట్ల రూపాయలు. బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్‌లలో కూడా పాల్గన్న యువరాజ్ గోర్పడే తర్వాత అమర్ ఖాన్ కు బాడీగార్డ్ గా సెటిలైపోయారు. అమితాబ్ బచ్చన్ కు జితేంద్ర షిండే అనే బాడీగార్డు ఉన్నారు. అతనికి రూ. కోటిన్నర చెల్లిస్తున్నారు. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్‌లకు పర్సనలైజ్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వీరు ఒక్కొక్కరికి రూ. కోటి ఇరవై లక్షల వరకూ చెల్లిస్తున్నారు.
17 ఏళ్లకే లవ్ ఫెయిల్ - రోడ్డు పక్కన కాఫీ అమ్మారు -ఇప్పుడు కోట్లకు అధిపతి - ఈ మహిళ సాధించారు !
నమ్మకం ఉండే బాడీగార్డులకు పెద్ద పీట
బాలీవుడ్ నటులు సహజంగా బయటకు వెళ్తే భారీ సెక్యూరిటీ ఉంటుంది. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ పర్సనలైజ్డ్ బాడీగార్డులు వ్యక్తిగత పర్యటనల్లోనూ వెంటే ఉంటారు. తమ హీరోలను కంటికి రెప్పలా చూసుకుంటారు.