Sandheepha Chain of Restaurants : పదిహేడేళ్లకే ప్రేమ పేరుతో ఓ యువకుడి ఆకర్షణలో పడిపోయారు. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా వెళ్లిపోయారు. అతను డ్రగ్స్ బానిసయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మహిళ జీవితం ఎలా ఉంటుంది ?. అందరూ ఊహించుకున్నట్లుగా లేదు. ఆ మహిళలో చాలా పట్టుదల ఉంది. ఎంత అంటే ఏటికి ఎదురీదే అంత. అనుకున్ని సాధించే అంత. ఇప్పుడు ఆమె చెన్నైలోని సందీప హోటల్స్ కు యజమానికి.
పాట్రిషియా నారాయణ్ కుటుంబానికి పదిహేడేళ్ల వయసులోనే దూరం అయ్యారు. ఓ యువకుడితో ప్రేమలో పడి వెళ్లిపోయారు. ఆ యువకుడు డ్రగ్స్ కు బానిస కావడంతో ఇక తానే కుటుంబాన్ని నడపాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం మొదట ఉద్యోగంకోసం ప్రయత్నాలు చేశారు. ఎక్కడా చిన్న పనికూడా దొరకలేదు. దీంతో కాఫీ అమ్మాలని నిర్ణియంచుకున్నారు. బీచ్ లోచిన్న బిల్ల మీద అర్థరూపాయికి కాఫీ అమ్మడం ద్వారా తన బిజినెస్ జర్నీ ప్రారంభించారు. మెరీనా బీచ్ లో ఆమె అమ్మే కాఫీకి మంచి పేరు వచ్చింది. కాస్త డబ్బులు చేతికి అందిన తర్వాత ఆ స్టాల్ ని కాఫీతో పాటు సమోసా.. తినుబండారాలు అమ్మే దుకాణంగా మార్చారు.
లేగదూడను ముద్దు చేసిన ప్రధాని మోదీ - క్యూట్ వీడియో
తర్వాత మెల్లగా కేటరింగ్ ఆర్డర్ల కోసం ప్రయత్నించారు. మెల్లగా ఆర్డర్లు పొందారు. ఆమె వంట రుచి బాగుండటంతో చిన్నగా ప్రారంభమైనా పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. చివరికి ప్రభుత్వ కార్యక్రమాలకూ ఆర్డర్లు పొందే స్థాయికి వెళ్లారు. ఈ క్రమంలో వచ్చే డబ్బులతో ఓ హోటల్ చైన్ లో భాగస్వామిగా చేరారు. అయితే ఆమె ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే సొంత హోటల్ చైన్ పెట్టాలన్న ఉద్దేశంతో కుమార్తె పేరుతో సందీప చైన్ రెస్టారెంట్ ను ప్రారంభించారు.
తమిళనాడు రాజకీయాల్లో క్రీమ్ బన్ పాలిటిక్స్ - నిర్మలా సీతారామన్ పై విమర్శలు
పాట్రిషియా నారాయణ్ ప్రయత్నాల్లో అన్నీ సక్సెస్‌లే కాదు.. ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి.. అంతకు మించి కుటుంబ పరంగా ఎన్నో విషాదాలు ఎదురయ్యాయి. వ్యాపారం కుదటపడుతున్న దశలో భర్త చనిపోయాడు. కాస్త ఆర్థికంగా స్థిరపడుతున్న దశలో కుమార్తె, అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కుమారుడితో కలిసి ఇప్పుడు సందీప హోటల్స్ చైన్ ను నిర్వహిస్తున్నారు. ఆమె వ్యాపార ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.
పాట్రిషియా నారాయణన్‌కు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇప్పటికి ఆమె హోటల్స్ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటారు.