Bun and cream  GST quip from TN hotelier sparks row : "మంత్రిగారూ..  హోటల్స్ లో అమ్ముతున్న ఆహారపదార్థాల మీద జీఎస్టీ విషయంలో అనేక సమస్యలు వస్తున్నాయి. బన్ను మీద జీఎస్టీ లేదు.. కానీ క్రీమ్ బన్ను మీద పన్నెండు శాతం జీఎస్టీ ఉంది. అందకే కస్టమర్లు బన్ను, క్రీమ్ వేర్వేరుగా తీసుకు రమ్మంటున్నారు . ఇదొక్కటే కాదు.. హోటల్స్ లో అమ్ముతున్న ఆహారంపై అనేక రకాల జీఎస్టీలు ఉన్నాయని వాటిని సింప్లిపై చేయాలి" అని కోయంబత్తూర హోటల్స్  వ్యాపారులు మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు.  ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వ్యాపారికి నిర్మలా సీతారామన్ ఎలాంటి వివరణ అప్పుడు ఇవ్వలేదు.

  





 అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వెంటనే ఆయన నిర్మలా సీతారామన్ కు క్షమాపణలు చెబుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. తాను రాజకీయ కోణంలో అలా మాట్లాడలేదని..తనకు రాజకీయ సంబంధం లేదని ఆయన అందులో వివరణ ఇచ్చుకుంటూ క్షమాపణ చెబుతున్నారు. 





 ఈ అంశం తమిళనాడులో దుమారం రేగింది. దీంతో నిర్మలా సీతారామన్ స్పందించారు. జీఎస్టీ రేట్ల విషయంలో జీఎస్టీ కౌన్సిల్ ఉందని.. కేర్ ఫుల్ గా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.  


హోటల్ వ్యాపారితో బలవంతంగా క్షమాపణలు చెప్పించాలని తమిళనాడు ఆత్మగౌరవాన్ని తగ్గించారని అన్నాడీఎంకే సహా ఇతర పార్టీలు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  దీనిపై ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు విపక్ష నేతలు నిర్మలపై విమర్శలు గుప్పించారు. ఆ వ్యాపారిని బెదిరించి  బలవంతంగా క్షమాపణలు చెప్పించారన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన శ్రీనివాసవన్.. కోయంబత్తూరులో  ప్రముఖ హోటల్ చైన్ నిర్వహిస్తున్నారు. వందకుపైగా హోటళ్లను ఆయన నిర్వహిస్తున్నారు. కోయంబత్తూరు హోటళ్ల  సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు.                                 


సాధారణంగా చెప్పిన సమస్య వైరల్ గా మారడంతో.. ఆయనకు బెదిరింపులు వచ్చాయని అందుకే క్షమాపణలు చెప్పారని భావిస్తున్నారు.